తెలంగాణలో ఫాక్స్‌కాన్ సంస్థ పెట్టుబడులు, ఒక లక్ష ఉద్యోగాల కల్పన…సీఎం కేసీఆర్ తో చైర్మన్ యంగ్ లియూ భేటీ

Worlds Largest Electronics Manufacturer Foxconn To Invest In Telangana Chairman Young Liu Meets CM Kcr,Worlds Largest Electronics Manufacturer Foxconn, Foxconn To Invest In Telangana,Chairman Young Liu Meets CM Kcr,Mango News,Mango News Telugu,Foxconn Announces Mega Investment In Telangana,Foxconn To Create 1 Lakh Jobs,Foxconn To Set Up Electronics Manufacturing,Foxconn India,Foxconn Announces Investment In Hyderabad, Foxconn Hyderabad, Foxconn Investment In India, Foxconn News And Updates, Huge Investment For Telangana, Telangana Investment Latest News And Updates, Vedanta-Foxconn Project Details

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్ హాయ్ ఫాక్స్‌కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి లభ్యం కానుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.

యంగ్ లియూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యంగ్ లియూకి అందచేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ లియూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, ఐటీ మరియు పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =