కేవైసీ స్టేటస్ కోసం ఏ వెబ్ సైట్ ఏంటి?

How to know Your FASTAG Status, How to know Your FASTAG, FASTAG Status, Fastag KYC, Fastag, NHAI, know Your FASTAG Status, FASTAG KYC Status, Latest KYC News, Latest KYC News Updates, Latest KYC Updates, KYC 2024, Technology, Mango News, Mango News Telugu
Fastag KYC,Fastag ,NHAI , know your FASTAG status? FASTAG KYC status,

ఫాస్టాగ్ విషయంలో నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా  కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను త్వరలో డీయాక్టివేట్‌ చేస్తామని స్పష్టం చేసింది .కేవైసీ కోసం  2024 జనవరి 31ని ఆఖరు తేదీ అని ప్రకటించింది. ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్‌  అనే నిబంధన ఉండాలన్న ఉద్దేశంతో నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా  ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకూ ఒక వెహికల్‌కు ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు ఉండటంతో పాటు.. ఒకే ఫాస్టాగ్‌ను వేర్వేరు వెహికల్స్‌కు వాడటం వంటి పనులు చేస్తున్నట్లు ఇది గుర్తించింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాహనదారుల కేవైసీ పూర్తి  చేయకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు  నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా  గుర్తించింది.

అలాగే ఫాస్టాగ్‌లను వెహికల్  ముందుభాగంలో పెట్టకుండా.. ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ అతికిస్తుండటంతో టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించిన  నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా.. వీటికి చెక్‌ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకుంది.

టోల్‌ ఫీజు చెల్లింపుల కోసం వెహికల్ మిర్రర్‌కు  స్టిక్కర్‌లా అతికించే ఫాస్టాగ్‌లను బ్యాంకు బ్రాంచులు, టోల్‌ ప్లాజాలు, లోకల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసులు,  కామన్‌ సర్వీస్‌ పాయింట్లు, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్స్‌, పెట్రోల్‌ బంకుల వద్ద ఈ ఫాస్టాగులను కొనొచ్చు. ఫాస్టాగుల  కోసం వెహికల్ ఆర్‌సీ, చిరునామా, గుర్తింపుకార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అవసరం పడతాయి.

ఒకవేళ మీ ఫాస్టాగ్‌ స్టేటస్‌ను  తెలుసుకోవాలంటే ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌ అంటే https://fastag.ihmcl.com కి వెళ్లాలి. అక్కడ  మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. తర్వాత డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ  కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఆ వాహనికి కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అక్కడ అడిగిన వివరాలను ఇచ్చి ప్రాసెస్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 15 =