ఒక దశలో ద్రావిడ్ పై ఆశలు వదులుకున్నాం – సౌరవ్ గంగూలీ

BCCI President Sourav Ganguly, BCCI Roped In Rahul Dravid As Head Coach, Dravid, international sports news, latest sports news, Mango News, Rahul Dravid appointed as Team India head coach, Rahul Dravid As Head Coach, Rahul Dravid as Team India head coach, Sourav Ganguly, Sourav Ganguly About Dravid, Sourav Ganguly on Dravid, Sourav Ganguly Reveals How BCCI Roped In Rahul Dravid, Sourav Ganguly Reveals How BCCI Roped In Rahul Dravid As Head Coach, sports news

భారత వెటరన్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ గురించి మాజీ కెప్టెన్, బీసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక ఆసక్తికర విషయం తెలియజేసారు. ఇటీవల T-20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి టర్మ్ ముగియటంతో రాహుల్ ద్రావిడ్ ఆ స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే, దానికి ముందు అతడిని ఒప్పించటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, చాలాసార్లు ప్రయత్నించానని తెలిపారు. ఒక దశలో ఆశలు వదులుకున్నామని కూడా చెప్పారు. కానీ, చివరికి అతడిని తాము ఒప్పించగలిగినట్లు బీసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.

రవి శాస్త్రి తర్వాత రాహుల్ ద్రావిడ్ ని హెడ్ కోచ్ గా నియమించాలని నేను, జైషా చాలాకాలం గా అనుకుంటున్నాం. దానిపై అతడితో చాలాసార్లు సంప్రదింపులు జరిపాం. కానీ, రాహుల్ మా ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకంటే, తనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం, జట్టు పర్యటనల వలన కుటుంబానికి చాలా రోజులు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో అతడు మొదట విముఖత చూపించాడు. అదే సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్ళతో కూడా మాట్లాడి, రాహుల్ పై అభిప్రాయాన్ని కనుక్కున్నాం. ద్రావిడ్ కోచ్ గా ఉండటానికి ఆటగాళ్లు కూడా సుముఖత వ్యక్తం చేయటంతో ఆ విషయాన్నీ ద్రావిడ్ కి తెలియజేసి, ఎట్టకేలకు అతడిని ఒప్పించగలిగాం అని సౌరవ్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =