తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ దంపతులు భారీ స్వర్ణ కానుకను సమర్పించారు. గురువారం (నవంబర్ 26) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులకు ఈ ఆభరణాలను అందించారు. మొత్తం 121 కేజీల బంగారంతో తయారు చేసిన 46 రకాల వేర్వేరు ఆభరణాలు, అమ్మవారి వస్త్రాన్ని సమర్పించగా, వీటి విలువ సుమారు రూ.207.6 కోట్లుగా పేర్కొన్నారు.
ఈ భారీ కానుకలో శ్రీవారి కోసం 106 కిలోల బంగారంతో ఆభరణాలు చేయించగా, శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రాన్ని వర్ధమాన్ జైన్ దంపతులు కానుకగా అందజేశారు. కిరీటం, వడ్డాణం, శంఖుచక్రాలు, హారాలు, పాద కవచాలు సహా 46 రకాల ఆభరణాలను సంప్రదాయ పద్ధతుల్లో రూపొందించారు. వీటిలో 2,427 క్యారట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో పాటు 238.2 క్యారట్ల వజ్రాలు పొదిగిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీవారు ఆదేశించడంతోనే తాము ఈ విరాళం సమర్పించామని వర్ధమాన్ జైన్ దంపతులు పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భక్తి, విశ్వాసంతో ఈ అపురూప కానుకను అందించిన దాతల సేవలను సీఎం కొనియాడగా, స్వామివారికి శుక్రవారం అభిషేక సేవ అనంతరం ఈ ఆభరణాలను అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల చరిత్రలో నిలిచిపోయే ఈ భారీ విరాళంపై భక్తులు, ఆలయ వర్గాలలో విశేష ఆసక్తి నెలకొంది. స్వామివారి నిత్య, విశేష సేవల వేళ భక్తులకు ఈ ఆభరణాలు కనువిందు చేయనున్నాయి.
46 రకాల స్వర్ణ ఆభరణాల జాబితా:
పాదాలకు సంబంధించిన ఆభరణాలు:
-
-
బంగారు పాద కవచములు – 3
-
బంగారు అందెలు – 3
-
బంగారు పాకడాలు
-
హారాలు మరియు కంఠాభరణాలు:
-
-
బంగారు తులసిపాత్ర హారం
-
బంగారు అష్టోత్తర కాసుల మాల
-
బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
-
బంగారు అశ్వథ పాత్ర హారము
-
బంగారు ఐదు పేటల కంఠీలు – 5
-
బంగారు చంద్రవంకీ కంఠీ
-
బంగారు సాలిగ్రామ హారములు – 3
-
బంగారు కమలం తరహా సాలిగ్రామాలు – 3
-
వడ్డాణాలు మరియు మొలతాడు:
-
-
బంగారు సాదా వడ్డాణము
-
బంగారు గంటల మొలతాడు
-
బంగారు నాగాభరణ వడ్డాణము
-
హస్తాలు, భుజాలు, చెవులు మరియు శిరస్సు ఆభరణాలు:
-
-
బంగారు పులిగోరు
-
బంగారు సూర్యకటారి
-
బంగారు కౌస్తుభం
-
బంగారు శ్రీవత్సం
-
బంగారు మోచేయి
-
బంగారు కటి హస్తం
-
బంగారు గోపు
-
బంగారు వైకుంఠ హస్తం
-
బంగారు నాగాభరణ కడియాలు – 4
-
బంగారు భుజ కీర్తులు – 3
-
బంగారు కర్ణపత్రములు – 3
-
బంగారు భావళీలు – 3
-
బంగారు మోపుగల యజ్ఞోపవీతం
-
బంగారు శంఖ కవచము
-
బంగారు చక్ర కవచము
-
బంగారు కిటీపు ముఖపట్టి
-
బంగారు కిరీటము
-
రత్నాలు మరియు వజ్రాలు పొదిగిన ఆభరణాలు:
-
-
2,427 క్యారట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
-
238.2 క్యారట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు
-







































