దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ నటించగా, ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పలు రికార్డులను కొల్లగోట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటనకు గానూ రామ్ చరణ్ కు, జూ.ఎన్టీఆర్ కు దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఆస్కార్-2023 బరిలోకి నిలిచే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ చిత్రం ‘చెల్లే షో’ ను భారత్ తరుపున ఆస్కార్ నామినేషన్ కు పంపుతున్నట్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ క్యాంపెయిన్ కింద ఆస్కార్ బరిలోకి ఆర్ఆర్ఆర్ దిగుతుంది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ టీమ్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ కు సంబంధించి బెస్ట్ మోషన్ ఫిక్చర్ తో పాటు మరో 14 కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను అప్లై చేస్తునట్టు టీమ్ వెల్లండించింది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
“ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మైలురాళ్లను సృష్టించడం ద్వారా, భాషా మరియు సాంస్కృతిక అడ్డంకులను అధిగమించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను ఏకం చేయడం ద్వారా ఆర్ఆర్ఆర్ యొక్క అఖండ విజయం ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించినందుకు మేము గౌరవంగా భావిస్తున్నాం. గత కొన్ని నెలలుగా మా సినిమాను ఇష్టపడి, మమ్మల్ని ఉత్సాహపరిచిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు ఈ ప్రయాణాన్ని సుసాధ్యం చేశారు. మేము జనరల్ కేటగిరీలో ఆస్కార్ల పరిశీలన కోసం అకాడమీకి దరఖాస్తు చేశాము. మేము మా ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు దీన్ని సాధ్యం చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
ఆస్కార్ కై ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ కింద ఆర్ఆర్ఆర్ దరఖాస్తు చేస్తున్న కేటగిరీలు ఇవే:
- బెస్ట్ మోషన్ ఫిక్చర్ – డీవీవీ దానయ్య
- బెస్ట్ డైరెక్టర్ – ఎస్.ఎస్ రాజమౌళి
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – విజయేంద్ర ప్రసాద్ (స్టోరీ), ఎస్.ఎస్ రాజమౌళి (స్క్రీన్ ప్లే), సాయి మాధవ్ బుర్రా (అడిషనల్ డైలాగ్స్)
- బెస్ట్ యాక్టర్ – రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – అజయ్ దేవగన్
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – అలియా భట్
- బెస్ట్ సినిమాటోగ్రఫీ – కేకే సెంథిల్ కుమార్
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు సాంగ్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఎంఎం కీరవాణి
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – రమా రాజమౌళి
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్
- బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – నల్లా శ్రీను, సేనాపతి నాయుడు
- బెస్ట్ సౌండ్ – రఘునాథ్ కెమిశెట్టి (సౌండ్ డిజైనర్), బోలోయ్ కుమార్ డోలోల్ (రి-రికార్డింగ్ మిక్సర్), రాహుల్ కార్పే (రి-రికార్డింగ్ మిక్సర్)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – వి.శ్రీనివాస్ మోహన్ (విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY