ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీఎం జగన్.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎం జగన్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కాగా సీఎం జగన్ కూడా బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
Wishing Sri @ysjagan a Very Happy 50th Birthday!! Many Many Happy Returns of the Day!! 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 21, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ