ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు వాసిరెడ్డి పద్మ రిజైన్

Vasireddy Padma Resign , AP election,AP Women Commission Chairperson,CM Jagan, YCP,Chandrababu, TDP, Janasena,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu, Mango News
Vasireddy Padma Resign , AP election,AP Women Commission Chairperson,CM Jagan, YCP,Chandrababu, TDP, Janasena

ఎన్నికలు సమీపిస్తుండటంతో..రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత క్యూరియాసిటితో గమనిస్తున్నారు ఏపీ వాసులు. ఎక్కడ  ఏ రాజకీయ పరిణామం జరిగినా ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులతో  రాత్రికి రాత్రే కొనసాగుతున్న వలసలు సొంత పార్టీ నేతలకే షాక్ కొట్టేలా చేస్తున్నారు. ముఖ్యంగా సీటు ఆశించి భంగపడిన నేతలంతా పక్క పార్టీల కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. దీంతీ నిన్న మొన్నటివరకూ అదే పార్టీని చెడామడా తిట్టిన నోటితోనే ఆ పార్టీపైన ప్రశంశిస్తున్న నేతల తీరుతో ఏపీ ప్రజలు కంగుతింటున్నారు.

ఈ లిస్టులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చివరకు మంత్రులు కూడా ఉండటంతో మొత్తంగా ఏపీ పొలిటికల్ సీన్ చిత్రవిచిత్రాలతో నిండిపోయినట్లు అవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.ఇన్ని రోజులు ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ..తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ముందు..అంత సడెన్‌గా  ఆ పదవికి వాసిరెడ్డి పద్మ ఎందుకు రాజీనామా చేశారు అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలైంది.

తన పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ..ఆ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సమర్పించారు. అయితే, ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్‌ను ఆమెకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీని తర్వాత మీడియా ముందుకు వచ్చిన పద్మ.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేయడానికి తాను సిద్దమని చెప్పుకొచ్చారు . రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటంతో.. పార్టీ కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోతున్నానని..ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నానని పద్మ అన్నారు.

వైఎస్సాసీపీ ప్రతిపక్షంగా  ఉన్న సమయంలో అధికార టీడీపీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యేవారు పద్మ. దీంతోనే ఆమె వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ పదవిని  దక్కించుకున్నారు.అయితే  గత ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ తన మనసులోని మాటను అధినేత ముందుంచి.. టికెట్‌ ఆశించి భంగపడిన ఆమె ఎలాగో సర్దుకుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికలలో అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన పద్మలో అలాగే ఉన్నా కూడా అధినేత జగన్ ఆ దిశగా అస్సలు ఆలోచించలేదన్న భావనలో పద్మ ఉన్నారు.

ఈ సారి కూడా తనకు టికెట్‌ దక్కే అవకాశం లేదనే సంకేతాలు వాసిరెడ్డి పద్మకు వెళ్లటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆమె రాజీనామా చేయడంతో పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది.తన రాజీనామాకు, సీటుకు ఎలాంటి సంబంధం లేదని బయటకు అలా చెబుతున్నా లోలోపల పద్మ అధినేత తీరుతో కుతకుతలాడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  మరోసారి వైఎస్‌ జగన్‌ను సీఎంను చేయడానికి తాను  రాజీనామా చేసినట్లు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY