ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన వర్ల రామయ్య

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APSRTC Latest News, APSRTC Latest Updates, Mango News Telugu, Varla Ramaiah Resigns, Varla Ramaiah Resigns From APSRTC, Varla Ramaiah Resigns From APSRTC Chairman Post

టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఎట్టకేలకు అక్టోబర్ 26, శనివారం నాడు ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు సంస్థలకు చైర్మన్లుగా ఉన్న టీడీపీ నాయకులు రాజీనామా చేసారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఆర్టీసీ చైర్మన్ గా తన పదవీకాలం ఏప్రిల్‌ 24, 2019 నాటికే ముగిసినా ఆయన పదవి నుంచి వైదొలగలేదు. ఈ క్రమంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నెల రోజుల పాటు గడువిస్తూ సెప్టెంబర్ లో వర్ల రామయ్యకు నోటీసులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న నెల రోజుల తరువాత ఆయన ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =