అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. నారాయణ హృదయాలయకు చేరుకుంటున్న కుటుంబ సభ్యులు

Actor Nandamuri Taraka Ratna Health Condition is Highly Critical, Family Members Reached Bengaluru Hospital,Nandamuri Taraka Ratna,Taraka Ratna,Nandamuri Taraka Ratna Live,Nandamuri Taraka Ratna Live News,Nandamuri Taraka Ratna Latest News,Nandamuri Taraka Ratna News,Nandamuri Taraka Ratna Live Updates,Nandamuri Taraka Ratna Latest Updates,Mango News Telugu,Mango News,Nandamuri Taraka Ratna Health Condition,Nandamuri Taraka Ratna Latest Health Condition,Taraka Ratna Latest Health Condition,Nandamuri Taraka Ratna Latest Health Report,Nandamuri Taraka Ratna Health Report,Taraka Ratna Health Report,Nandamuri Taraka Ratna Health Condition is Critical,Nandamuri Taraka Ratna In Critical Condition

సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గడచిన మూడు వారాలుగా ఆయనకు చికిత్స అందిస్తున్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాల ప్రకారం, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కాగా తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బెంగళూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇక ఇప్పటికే తారకరత్న కుటుంబ సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి నారాయణ హృదయాలయను సందర్శించి తారకరత్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తారకరత్న బాబాయి, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలారోజులపాటు బెంగళూరులోనే ఉండి అన్ని సౌకర్యాలు కల్పించారు. కాగా జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు హాజరైన తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + four =