టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలపై కేసు నమోదు.. అనపర్తి పరిధిలోని బిక్కవోలు స్టేషన్‌లో ఫిర్యాదు

AP Police Files Case Against TDP Chief Chandrababu and Other Party Leaders in Bhikkavolu Station, Eeast Godavari District,Mango News,Mango News Telugu,AP Police,AP Police Latest News,Bhikkavolu Station,TDP Chief Chandrababu,Chandrababu,TDP,TDP News,TDP Party,TDP Chief Chandrababu,TDP Chief Chandrababu Live,TDP Chief Chandrababu Live Updates,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu News,TDP Chief Chandrababu Latest Updates,TDP Chief Chandrababu Live News,TDP Chief Chandrababu Latest,AP Police Files Case Against TDP Chief Chandrababu

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయింది. శుక్రవారం అనపర్తిలో చోటుచేసుకున్న ఘటనపై నియోజకవర్గం పరిధిలోని బిక్కవోలు స్టేషన్‌లో ఆయనపై ఏపీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అలాగే ఆయనతో పాటు మాజీ మంత్రులు చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌ సహా ఎనిమిది మంది కీలక నేతలు మరియు దాదాపు 1,000 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు అయింది. ఈ మేరకు డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్‌షో నిర్వహించారని, ఈ సందర్భంగా అడ్డుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అనపర్తిలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్‌షో, బహిరంగ సభలకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. అయినాసరే చంద్రబాబు ముందుకే సాగడంతో ఆయన వాహనం కదలకుండా అడ్డుగా కూర్చుని కట్టడి చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఈ క్రమంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ టీడీపీ శ్రేణులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ ఉద్రిక్త పరిస్థుతుల మధ్యే చంద్రబాబు దాదాపు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనలపై పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =