ఆలంపూర్, జోగులాంబ ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు – ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha Visits Alampur and Jogulamba Temples, Offers Special Pujas on Maha Shivaratri Festival,Mango News,Mango News Telugu,BRS MLC Kavitha Visits Alampur,MLC Kavitha,MLC Kavitha Live,MLC Kavitha Live Updates,MLC Kavitha Latest News,MLC Kavitha News,MLC Kavitha Latest Updates,MLC Kavitha Live News,MLC Kavitha Latest,Maha Shivratri,2023 Maha Shivratri,Maha Shivratri 2023,MLC Kavitha Visits Alampur,MLC Kavitha Visits Alampur and Jogulamba Temples,Maha Shivaratri Festival,Kavitha Visits Alampur and Jogulamba Temples,Kavitha Visits Alampur and Jogulamba Temples on Maha Shivaratri Festival

ఆలంపూర్, జోగులాంబ ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత. ఈ మేరకు ఆమె శనివారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అలంపూర్‌లోని బాల బ్ర‌హ్మేశ్వ‌ర స్వామి ఆల‌యం మరియు జోగులాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఈ క్రమంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆలంపూర్ ఆలయాన్ని అద్భుత‌మైన పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్దుతామని, అలాగే జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామ‌ని హామీ ఇచ్చారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని రకాలుగా శాంతియుత వాతావరణం ఉందని, కానీ దేశంలో మాత్రం విపరీత ధోరణితో ఉన్న నాయకత్వం ఉందని వ్యాఖ్యానించారు. వారి విపరీత పోకడల వల్లే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సహృదయంతో ఆలోచించే నాయకత్వం రావాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశామని క‌విత‌ తెలిపారు. కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా గతంలో అలంపూర్ ప్రాంతానికి నీరు వచ్చేది కాదని, కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం ‌నీటి‌ సదుపాయం క‌ల్పించామ‌ని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తుమ్మిళ్ల లిఫ్ట్, ఆలంపూర్ లిఫ్ట్‌ల‌ను బాగు చేసుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 2 =