ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో

Rashmika, Rashmika's Deep Fake Video, internet by storm, celebrities in trouble, Rashmika Video, Zara Patel
Rashmika, Rashmika's Deep Fake Video, internet by storm, celebrities in trouble, Rashmika Video, Zara Patel

రష్మిక డీప్ ఫేక్ వీడియో తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నల్లటి, పొట్టి దుస్తుల్లో   డీప్ క్లీవేజ్ షోతో లిఫ్ట్ ను ఆపి లోపలికి వెళ్తున్నట్టు ఉన్న రష్మికను చూసి ఆమె ఫ్యాన్స్ షాక్  అయ్యారు. రష్మిక ఆ స్థాయిలో ఇంతవరకు ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేయలేదు కదా మరి ఇదేంటని అయోమయంలో పడిన అభిమానులు..అది ఏఐ టెక్నాలజీ సాయంతో ఈ డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

 

ఈ వీడియోలో ష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి నెట్‌లో అప్ లోడ్ చేశారు. ఇలా అప్ లోడ్ చేశారో లేదో నిమిషాల్లో వైరల్ అయిపోయింది ఆ వీడియో.  ఆ వీడియో రష్మిక దాకా చేరింది. ఆమె ఆ వీడియోను చూసి చాలా అప్‌సెట్ అయింది. ఇలా టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చూస్తుంటే భయం వేస్తోందని అన్నారు. తాను చదువుకునే వయసులో ఇలా జరిగి ఉంటే ఎలా ఎదుర్కొవాలో కూడా తెలిసి ఉండేది కాదని తన ఇన్ స్టా స్టేటస్‌లో రాసుకొచ్చారు.

 

ఈ వీడియో బయటికి వచ్చిన మొదట్లో రష్మికను అందరూ తీవ్రంగా ట్రోల్ చేశారు. తరువాత అది ఫేక్ వీడియో అని తెలిశాక రష్మికను బాధితురాలిగా చూడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఫేక్ వీడియోలో బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. అలా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా రష్మికకు మద్ధతుగా నిలుస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోను ఎవరు క్రియేట్ చేశారో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

ఆ వీడియోలో నిజానికి ఉన్నది బ్రిటిష్ ఇండియన్ సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్ జారా పటేల్. ఆమె కూడా ఈ ఫేక్ వీడియోపై స్పందించారు. తన శరీరానికి రష్మిక ఫేస్ పెట్టారని ఆమె నిర్ధారించారు. అలా మార్ఫింగ్ చేయడంలో తన ప్రమేయం లేదని ఆమె తెలిపారు. మహిళలు, ఆడపిల్లల భద్రత ప్రమాదంలో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియలో ఫోటోలు పోస్టు చేసే ముందు ఆలోచించుకుని పోస్టు చేయాలని ఆమె సూచించారు.

 

రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ వీడియోపై తీవ్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ వీడియోపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలంతా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్టు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =