అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్‌లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్‌ ఆరా

AP 7 Students Missing at Pudimadaka Beach in Anakapalle District CM Jagan Inquired Over Incident, AP CM YS Jagan Inquired Over Incident, AP 7 Students Missing at Pudimadaka Beach in Anakapalle District, 7 Students Missing at Pudimadaka Beach in Anakapalle District, Pudimadaka Beach in Anakapalle District, Anakapalle District Pudimadaka Beach, Seven students were feared drowned in the sea, 7 Students Missing in Pudimadaka Beach, Engineering student drowns in Pudimadaka beach, Pudimadaka Beach News, Pudimadaka Beach Latest News, Pudimadaka Beach Latest Updates, Pudimadaka Beach Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కాగా శుక్రవారం అనకాపల్లి డైట్‌ కాలేజీకి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు విహారానికి రాగ, వారిలో ఏడుగురు విద్యార్థులు బీచ్‌లో గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. దీనిపై సమాచారం అందుకున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టాన్‌ శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మెరైన్‌ పోలీసులు, నాలుగు బోట్లతో కోస్ట్‌ గార్డు బృందాలు, గజఈతగాళ్లతో రాత్రి 9 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు అయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపిన అధికారులు మిగిలిన విద్యార్థుల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని సీఎం జగన్ కు వెల్లడించారు. స్థానిక మత్స్యకారులు రక్షించిన కొన ఊపిరితో ఉన్న అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు తెలియజేశారు. గల్లంతైనవారిలో జశ్వంత్‌ (నర్సీపట్నం), రామచందు (ఎలమంచి), సతీశ్‌ (గుంటూరు) ల ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు.

పూడిమడక బీచ్‌ వద్ద సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంటుంది. సాధారణంగా పర్యాటకులు ఎవరూ అటువైపు వెళ్లరు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12 మంది విద్యార్థులు బైక్‌లపై ఇక్కడకు చేరుకొని సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన రాకాసి అలలకు సముద్రంలోకి కొట్టుకుపోయారు. మిగతా విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పరుగున వచ్చి ఆ విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను కాపాడగలిగారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =