హెచ్1బీ వీసాదారులకు శుభవార్త.. గ్రేస్ పీరియడ్‌ 180 రోజులకు పొడిగింపు, యూఎస్ అడ్వైజరీ ప్యానెల్ సిఫార్సు

US Advisory Panel Recommends Extension of Grace Period From 60 to 180 Days For H1B Visa Holders, Amid Mass Layoffs,US Advisory Panel Recommends Extension,Extension of Grace Period,Grace Period From 60 to 180 Days For H1B,180 Days Grace Period For H1B Visa Holders,Mango News,Mango News telugu,US Advisory Panel,Amid Mass Layoffs News,Grace Period For H1B Visa,US Presidential Advisory Panel, H1B Visa Holders Latest News,H1B Visa Holders Latest Updates

అమెరికాలోని హెచ్1బీ వీసా హోల్డర్‌లకు బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారులకు గ్రేస్ పీరియడ్‌ను పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్‌కమిటీ నుండి ఫెడరల్ ప్రభుత్వం సిఫార్సును అందుకుంది. దీని ప్రకారం.. హెచ్1బీ వీసా గ్రేస్ పీరియడ్‌ని 60 నుండి 180 రోజుల వరకు పొడిగించనున్నారు. కాగా ఈమధ్య కాలంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్, ట్విటర్ మొదలైన పెద్ద కంపెనీల్లో ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులు పెద్దఎత్తున తొలగించబడటం తెలిసిందే. అయితే ప్రస్తుత 60-రోజుల గ్రేస్ పీరియడ్ అనేక అడ్డంకులను కలిగి ఉంది. ఫలితంగా, చాలా మంది హెచ్1బీ వీసాదారులు దేశం విడిచి వెళ్లవలసి వస్తుంది. దీని ఫలితంగా యునైటెడ్ స్టేట్స్‌కు నైపుణ్యం కలిగిన కార్మికులను కోల్పోవాల్సి వస్తుందని, దీనిని నివారించడానికే ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కనుక అమలులోకి వస్తే.. లక్షలాదిమంది భారతీయులకు ఉపశమనం కలుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − four =