డిసెంబర్ మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు?

AP Assembly 2019, AP Assembly Sessions 2019, AP Assembly Winter Sessions, AP Assembly Winter Sessions Will Conduct In December, AP Assembly Winter Sessions Will Conduct In December First Week, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ మొదటివారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సమావేశాలు నిర్వహించే తేదీలను రెండురోజుల్లోగా ఖరారు చేసే అవకాశమున్నట్టు సమాచారం. గత జూన్ లో ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను నిర్వహించి బడ్జెట్ తో పాటు సంక్షేమ పథకాలు, విధాన నిర్ణయాలకు సంబంధించిన పలు బిల్లులను ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఆరు నెలల లోపల రాష్ట్ర శాసనసభను సమావేశపరచవలసి ఉండడంతో డిసెంబర్ లో శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇసుక విధానంతో పాటు, ఇటీవల రెండు సార్లు జరిగిన మంత్రివర్గ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − nine =