అక్టోబర్ 31న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ, పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్

Jana Sena chief Pawan Kalyan, Mango News, pawan kalyan, Pawan Kalyan To Participate Vizag Steel Plant Protection Committee, Pawan Kalyan To Participate Vizag Steel Plant Protection Committee Public Meeting on OCT 31st, Vizag Steel Plant, Vizag Steel Plant Issue, Vizag Steel Plant Movement, Vizag Steel Plant Privatisation, Vizag Steel Plant Privatisation Issue, Vizag Steel Plant Protection Committee, Vizag Steel Plant Protection Committee Meeting, Vizag Steel Plant Protection Committee Public Meeting

అక్టోబర్ 31వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర జరగనున్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 31వ తేదీన పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అంశంపై తొలుతనే స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఫిబ్రవరి 9వ తేదీన పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని కేంద్రానికి తెలియచేస్తూ, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని వినతి పత్రం అందించిన విషయం విదితమే. 34 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందనే విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షాకు పవన్ కళ్యాణ్ తెలియచేశారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =