గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ : 503 పోస్టుల భర్తీ, మే 2 నుంచి మే 31 వరకు దరఖాస్తు

TSPSC Releases Group-1 Notification for Recruitment of 503 Posts, Group-1 Notification for Recruitment of 503 Posts, TSPSC Releases Group-1 Notification, tspsc group 1 recruitment 2022, 2022 tspsc group 1 recruitment, tspsc group 1 recruitment, telangana group 1 notification, Group-1 notification, Telangana State Public Service Commission group 1 recruitment 2022, 2022 Telangana State Public Service Commission group 1 recruitment, Telangana State Public Service Commission, Telangana State Public Service Commission group 1 notification, group 1 notification, Group-1 Notification News, Group-1 Notification Latest News, Group-1 Notification Latest Updates, Group-1 Notification Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ముందుగా ఏప్రిల్ 25న 16,614 పోలీసు ఉద్యోగాల‌కు ప్రభుత్వం నోటిఫికేష‌న్‌ ను విడుదల చేసింది. ఇక తెలంగాణ యువత ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ను ఏప్రిల్ 26, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్‌-1 కు సంబంధించి 18 విభాగాలకు చెందిన 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2014లో టీఎస్‌పీఎస్సీ ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇదే కావడంతో పాటుగా ఒకేసారిగా అత్యధిక పోస్టులు భర్తీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ గ్రూప్‌ -1 ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ ఉండనుంది.

ఈ పోస్టుల కోసం మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఈసారి గ్రూప్-1 పోస్టులు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు ద్వారానే భర్తీ చేయనున్నారు. అలాగే గతంలో ఈ పోస్టుల నియామకంలో ఉన్న ఇంటర్వ్యూ ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష జూలై/ఆగస్టు 2022లో, మెయిన్స్‌ పరీక్ష నవంబరు/డిసెంబరు 2022 లో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ప్రశ్నపత్రాలు తొలిసారిగా తెలుగు. ఇంగ్లీష్ తో పాటుగా ఉర్దూలో కూడా అందించనున్నారు.

గ్రూప్-1 పోస్టుల వివరాలు (503):

  1. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు – 42
  2. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు – 91
  3. కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ – 48
  4. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్స్ – 04
  5. జిల్లా పంచాయత్ ఆఫీసర్ – 05
  6. జిల్లా రిజిస్టార్ – 05
  7. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్ – 02
  8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ – 08
  9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ – 26
  10. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 – 41
  11. అసిస్టెంట్‌ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ – 03
  12. జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ – 05
  13. జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 02
  14. జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ – 02
  15. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ – 20
  16. అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ – 38
  17. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ – 40
  18. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎంపీడీవో) – 121

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =