వైఎస్ఆర్ కాపు నేస్తం : 3,38,792 మంది మహిళల ఖాతాల్లో రూ.508.18 కోట్లు జమ చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Released Rs 508.18 Cr YSR Kapu Nestham 3rd Phase Funds Today, YS Jagan Mohan Reddy Releases Rs 508 Crore Under YSR Kapu Nestam Scheme For Women, AP CM YS Jagan Mohan Reddy Releases Rs 508 Crore Under YSR Kapu Nestam Scheme For Women, AP CM YS Jagan Releases Rs 508 Crore Under YSR Kapu Nestam Scheme For Women, CM YS Jagan Releases Rs 508 Crore Under YSR Kapu Nestam Scheme For Women, AP CM Releases Rs 508 Crore Under YSR Kapu Nestam Scheme For Women, 508 Crore Under YSR Kapu Nestam Scheme For Women, YSR Kapu Nestham 3rd Phase Funds, YSR Kapu Nestam Scheme For Women, YSR Kapu Nestam Scheme, YSR Kapu Nestam Scheme Funds, YSR Kapu Nestam Scheme News, YSR Kapu Nestam Scheme Latest News, YSR Kapu Nestam Scheme Latest Updates, YSR Kapu Nestam Scheme Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు (జూలై 29, శుక్రవారం) మూడో ఏడాది “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకం నిధులు విడుదల చేశారు. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో జరిగిన బహిరంగ సభ నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా 3,38,792 మంది కాపు మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.508.18 కోట్ల కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ముందుగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల జీవనోపాధిని మెరుగుపర్చేలా ఏడాదికి రూ.15 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.75 వేల ఆర్ధిక సాయాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాపు మహిళల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

అందులో భాగంగా మొదటి ఏడాది 3,27,349 మంది మహిళల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, రెండో ఏడాది 3,27,244 మంది మహిళలకు రూ.490.86 కోట్లు జమచేశారు. ఇక మూడో ఏడాది కింద నేడు 3,38,792 మంది మహిళలకు రూ.508.18 కోట్లు జమచేశారు. దీంతో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద రాష్ట్రప్రభుత్వం మొత్తం రూ.1491.93 కోట్లను అందజేసినట్లు అవగా, ఒక్కో మహిళా లబ్ధిదారులకు రూ.45 వేల ఆర్థిక సాయం అందింది.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది అమలు కూడా 3,38,792 మంది అక్కచెల్లమ్మలకు నేరుగా వారి ఖాతాల్లోకి రూ.508.18 కోట్ల జమచేస్తున్నాం అన్నారు. ఎలాంటి లంచాలు, వివక్షకు ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పారు. ఇది పేదల, రైతుల, అక్కచెల్లమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా కూడా మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ.45 వేలు ఇచ్చామని, మొత్తం రూ.1,492 కోట్లు సాయం అందించామని అన్నారు. నవరత్నాల ద్వారా మూడు సంవత్సరాల్లో కాపు సామాజిక వర్గానికి రూ.16,256.44 కోట్ల లబ్ధి జరిగిందని, నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.16,039.93 కోట్ల లబ్ధి జరగగా, మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడు సంవత్సరాల్లో 32,296.37 కోట్ల లబ్ధి జరిగిందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 16 =