ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Meets Amit Shah, AP CM YS Jagan Visits Delhi, AP CM YS Jagan Visits Delhi And Meets Amit Shah, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, CM YS Jagan Visits Delhi, Gajendra Singh Shekhawat, Mango News Telugu, Polavaram Project, Polavaram Project 2019, Polavaram Project latest Updates, YS Jagan Visits Delhi, YSRCP Latest News 2019, Yuvajana Sramika Rythu Congress Party

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 26 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు నక్సలిజం పై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. ఉదయం 7.30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఇంటర్-స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. భారతదేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

సాయంత్రం వరకు కొనసాగనున్న ఈ సమావేశానికి బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరుకానున్నారు. సమావేశం అనంతరం హోం మంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లను కలుసుకుని రాష్ట్ర సమస్యలు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ వంటి అంశాలపై సీఎం జగన్ వారితో చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు, మధ్యాహ్నానికి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here