యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Ben Stokes Century, Ben Stokes century leads England To win Against Australia, Ben Stokes century leads England To win Against Australia In Third Test, England Won Against Australia, England Won Against Australia In Third Test, latest sports news, latest sports news 2019, Mango News, sports news

యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే లక్ష్య ఛేదనలో అతి పెద్ద గెలుపును నమోదు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇటీవలే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుతమైన ఆట తీరుతో ఇంగ్లాండ్ జట్టుకు కప్ అందించిన బెన్ స్టోక్స్ మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేసాడు. రెండో ఇన్నింగ్స్ లో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఇంగ్లాండ్ జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. ఛేదనలో 286 పరుగుల వద్ద 9వ వికెట్ పడిన తరుణంలో 73 పరుగులు చేయాల్సి ఉండగా, 11 నెంబర్ బ్యాట్స్‌మన్‌ జాక్ లీచ్ సహాయంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసి జట్టును గెలుపు బాట పట్టించాడు.

మూడో టెస్టు తోలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 179 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ కేవలం 67 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 246 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ముంగిట 359 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. 156/3 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్, కెప్టెన్ రూట్ (77) వికెట్ ఆరంభంలోనే కోల్పోయింది. తరువాత బెయిర్ స్టో 36 పరుగులు చేసి వెనుదిరగగా బట్లర్, క్రిస్ వోక్స్ చెరో ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. 286 పరుగుల వద్ద 9వ వికెట్ గా స్టువర్ట్ బ్రాడ్ వెనుదిరగడంతో, ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే పట్టుదలతో ఆడిన బెన్ స్టోక్స్ 10వ వికెట్ కు జాక్ లీచ్ తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 76 పరుగుల భాగస్వామ్యంలో 74 పరుగులు బెన్ స్టోక్స్ సాధించడం విశేషం. ఈ యాషెస్ సిరీస్ లో మొదటి టెస్టు ఆస్ట్రేలియా గెలువగా, రెండో టెస్టు వర్షం వలన డ్రాగా ముగిసింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలిచి 1-1 తో సమంగా నిలిచింది. సెప్టెంబర్ నాలుగో తేదీ నుండి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + one =