తెలంగాణ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు

Telangana State Annual Budget 2022-23 Live Updates, Telangana State Annual Budget 2022-23, Telangana State Annual Budget, Annual Budget 2022-23 Live Updates, Annual Budget 2022-23, Annual Budget 2022, 2022 Annual Budget, Telangana, Annual Budget 2022-23 Latest News, Annual Budget 2022-23 Latest Updates, Telangana Annual Budget, Telangana Annual Budget 2022, 2022 Telangana Annual Budget, Annual Budget, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అలాగే సమావేశాల తొలిరోజునే 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రిగా మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958.51 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. మరోవైపు శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

తెలంగాణ బడ్జెట్ 2022-22 ముఖ్యంశాలు:

 • రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు
 • క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు
 • దళితబందుకు రూ.17700 కోట్లు
 • పల్లె ప్రగతి పథకం కోసం రూ.3330 కోట్లు
 • ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి పథకం కోసం రూ.1394 కోట్లు
 • కొత్త వైద్య కళాశాలలకు రూ.1000 కోట్లు
 • అట‌వీ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు
 • తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటికి రూ. 16,144 కోట్ల పంట రుణాలు మాఫీ, ఈ దఫాలో ఇప్పటి వరకు మొత్తం 5.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు లబ్ది. ఇక రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీకి నిర్ణయం. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీకి నిర్ణయం.
 • వ్య‌వ‌సాయ రంగం – రూ.24,254 కోట్లు
 • పామాయిల్ సాగు కోసం – రూ.1000 కోట్లు
 • తెలంగాణకు హ‌రిత‌హారం కోసం – రూ.932 కోట్లు
 • సొంత స్థ‌లం ఉన్నవారికి డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం. సొంత‌స్థ‌లం ఉన్న 4 ల‌క్ష‌ల మందికి ప్రభుత్వం రూ.3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేయనుంది. ఎమ్మెల్యేల పరిధిలో నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇళ్లు చొప్పున మొత్తం 3.57 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయించనుండగా, సీఎం పరిధిలో నిర్వాసితులు, ప్ర‌మాద బాధితుల‌కు 43 వేల ఇళ్లు కేటాయించనున్నారు
 • భ‌వ‌న నిర్మాణరంగంలో ప‌ని చేస్తున్న కార్మికుల‌ కోసం సరికొత్త పథకం. మొద‌టి విడత‌లో ల‌క్ష మందికి స‌బ్సిడీపై మోటార్ సైకిళ్ల‌ను అంద‌జేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయం. ఈ ప‌థ‌కానికి సంబంధించిన విధి విధానాలు త్వ‌ర‌లో ప్రకటన.
 • మహిళా యూనివర్సిటీ కోసం – రూ.100 కోట్లు
 • ఆస‌రా పెన్ష‌న్ల‌ కోసం – రూ.11,728 కోట్లు, ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి స‌డ‌లించిన వ‌యోప‌రిమితి ప్ర‌కారం 57 ఏళ్ల కొత్త ల‌బ్ధిదారుల‌కు కూడా ఆస‌రా పెన్ష‌న్లు అందజేత.
 • విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల‌కు ఫ్యామిలీ పెన్ష‌న్ పాల‌సీని వర్తింప‌జేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం
 • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌ కోసం – రూ.2,750 కోట్లు
 • డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం – రూ.12,000 కోట్లు
 • మన ఊరు-మన బడి కార్యక్రమం కోసం – రూ.7,289 కోట్లు
 • ఎస్టీల సంక్షేమం – రూ.12,565 కోట్లు
 • బీసీల సంక్షేమం – రూ.5,698 కోట్లు
 • బ్రాహ్మ‌ణుల సంక్షేమం – రూ.177 కోట్లు
 • దూప దీప నైవేద్య ప‌థ‌కం కోసం – రూ.12.50 కోట్లు
 • పోలీస్ శాఖ రూ.9,315 కోట్లు
 • గీత కార్మికుల సంక్షేమం కోసం త్వరలో రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం.
 • రాష్ట్రంలో అన్నిప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజినిక్ కిట్స్ పంపిణీ, ఏడు లక్షల మంది విద్యార్ధినులకు ప్రయోజనం.
 • ఆర్టీసీ బలోపేతం కోసం – రూ.1500 కోట్లు
 • హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉచిత తాగునీటిపథకం (రోజుకు 20 లీటర్లు) కోసం- రూ.300 కోట్లు
 • హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు, ఏయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి రూ.500 కోట్లు
 • పాత‌బ‌స్తీలో 5.5 కిలోమీట‌ర్ల‌ మెట్రో రైలు కనెక్టవిటీ కోసం – రూ.500 కోట్లు
 • ఔట‌ర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఆవాసాల కోసం త్రాగునీటి సౌకర్యం కలిపించేందుకు – రూ.1200 కోట్లు
 • అర్బన్ మిషన్ భగీరథ – రూ.800 కోట్లు
 • కాళేశ్వరం టూరిజం సర్య్యూట్ కోసం – రూ. 750 కోట్లు
 • రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం – రూ.1542 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =