ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Sensational Comments Over MP Avinash Reddys CBI Probe,AP Govt Advisor Sajjala Ramakrishna Reddy,Sajjala Ramakrishna Reddy Sensational Comments,Ramakrishna Reddy Comments Over MP Avinash Reddy,MP Avinash Reddys CBI Probe,Mango News,Mango News Telugu,Sajjala Ramakrishna Reddy,Sajjala Ramakrishna Reddy Latest News,Sajjala Ramakrishna Reddy Latest Updates,Sajjala Ramakrishna Reddy Live News,Sajjala Comments,MP Avinash Reddy,MP Avinash Reddy Latest News,MP Avinash Reddy Latest Updates,MP Avinash Reddy Live News

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిపై జరుగుతున్న సీబీఐ విచారణ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పాలనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2019లో ఇదే రోజున ఎన్నికల ఫలితాలు వచ్చాయని, మే 30న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ఈ 4 ఏళ్లలో 4 పోర్ట్‌లను అభివృద్ధి చేశారని, అవినీతికి వ్యతిరేకంగా.. పేదలకు అనుకూలంగా జగన్ పాలన సాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు పరిపాలన వికేంద్రకరణ చేయడం కోసం సీఎం జగన్ 3 రాజధానులను చేపట్టారని, గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పి, వాలంటీర్ల వ్యవస్థను రూపొందించి దేశంలోనే అత్యుత్తమంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని తెలిపారు. ఎన్నికలప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలో 98.5 శాతం అమలు చేశారని, అందుకే వచ్చే ఎన్నికల్లో 2019 కన్నా మించిన విజయం ప్రజలు అందించనున్నారని పేర్కొన్నారు.

ఇక ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అవినాష్ తన తల్లికి బాలేదని చెప్పారని, సీబీఐ అరెస్ట్ చేస్తామంటే ఎస్పీ సహకరించలేదనేది అవాస్తవమని చెప్పారు. ప్రస్తుతం ఎంపీ తన తల్లి చికిత్సను దగ్గరుండి చూసుకుంటున్నారని, అయితే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మీడియా క్రియేట్ చేసిన ఒక ఉద్విగ్న వాతావరణం కారణంగా పార్టీ కార్యకర్తలు మరియు ఎంపీ అభిమానులు భారీగా ఆస్పత్రి వద్దకు గుమికూడారని తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా కాస్త ఆవేశానికి లోనైతే మీడియా మీద దాడి అంటున్నారని, మీడియాతో సహా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. సీబీఐ, రాష్ట్ర పోలీస్‌లను అవినాష్ అరెస్ట్ కోసం సాయం చేయమని అడిగారా? లేదా అనేది తమకు తెలియదని, అది డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ మధ్య జరుగే వ్యవహారమని పేర్కొన్నారు. ఇక ఎంపీ అవినాష్ టైం అడిగాడు ఇస్తే ఏమవుతుంది? చెప్పిన సమయం లోగా విచారణకు రాకపోతే సీబీఐ అరెస్ట్ చేయొచ్చని, అయితే గవర్నమెంట్‌కి అవినాష్ వ్యవహారానికి ఏ విధమైన సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =