ఆంధ్రప్రదేశ్ విభజన పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్

Mango News, Narendra Modi, PM Modi Comments of AP Bifurcation, PM Modi’s Telangana-Andhra Pradesh Bifurcation Comments In Parliament, PM Narendra Modi’s remarks on Telangana in Parliament, Prime Minister Of India, telangana, Telangana-Andhra Pradesh Bifurcation Comments, Undavalli, Undavalli Arun Kumar, Undavalli Arun Kumar Slams on PM Modi, Undavalli Arun Kumar Slams on PM Modi Comments, Undavalli Arun Kumar Slams on PM Modi Comments of AP Bifurcation

ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. విభజన సమయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన కుదరదని అనాడే అద్వానీ స్పష్టంగా చేశారన్నారు. చర్చ లేకుండా బిల్లు ఎలా ఆమోదిస్తారన్నారు. రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని నిలదీశారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని ఉండవల్లి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ఆనాడు కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై నరేంద్రమోదీ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు సహా అన్ని పార్టీలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎందుకు చర్చించడం లేదని ఆయన రాష్ట్రంలోని ఎంపీలను ప్రశ్నించారు. విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ రాష్ట్రానికి రావల్సిన నిధులను రాబట్టడంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని అరుణ్ కుమార్ విమర్శించారు. లోక్ సభలో మరోసారి చర్చ జరిగితేనే ఏపీకి సరియైన న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా కూడా మన ప్రభుత్వం ఈ విషయంలో ప్రశ్నించటానికి వెనుకాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =