ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Centre Once Again Gives Clarity Over Increase of Assembly Seats in AP and Telangana States, Central Govt Once Again Gives Clarity Over Increase of Assembly Seats in AP and Telangana States, Increase of Assembly Seats in AP and Telangana States, AP and Telangana States Assembly Seats, AP and Telangana States, Assembly Seats, No increase in Andhra Pradesh Assembly Seats, No increase in Telangana Assembly Seats, AP and Telangana Assembly seats increase, AP and Telangana, AP and Telangana Assembly seats News, AP and Telangana Assembly seats Latest News, AP and Telangana Assembly seats Latest Updates, AP and Telangana Assembly seats Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు/పునర్విభజనపై బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో మొత్తం సీట్ల సంఖ్య 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా లెక్కలు ప్రచురించబడే వరకు తిరిగి సర్దుబాటు చేయబడదు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరిస్తే తప్ప మరియు సవరించే వరకు సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు” అని పేర్కొన్నారు.

ముందుగా ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం రాజ్యసభలో ప్రశ్న అడిగారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. కాగా ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగితే కనుక, తెలంగాణలో అసెంబ్లీ నియోజక వర్గాలు 119 నుంచి 153కి, ఏపీలో ప్రస్తుతమున్న 175 నియోజకవర్గాల నుంచి 225 కు పెరగనున్నాయని చెప్పారు. గతంలో తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కూడా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఇదే సమాధానమిచ్చారు. దీంతో ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సి ఉంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here