అన్ని పార్టీలతో ఆడుకుంటున్న కమలం పార్టీ

BJP's strategy?, BJP playing with all parties,Pawan Kalyan,Modi, Jagan, Chandrababu, Pawan Kalyan, TDP, YCP, Jana Sena, BJP, Congress, Lok Sabha elections, Mango News Telugu, Mango News,AP Elections
BJP's strategy?, BJP playing with all parties,Pawan Kalyan,Modi, Jagan, Chandrababu, Pawan Kalyan, TDP, YCP, Jana Sena, BJP, Congress

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో.. హస్తిన పొలిటికల్ గేమ్‌తో  ఏపీ రాజకీయాలు  హీటెక్కిస్తున్నాయి.

మొన్నటికి మొన్న  బీజేపీ పెద్దలు, చంద్రబాబు మధ్యలో చర్చలు జరిగినప్పుడు.. బీజీపీ.. టీడీపీ,జనసేన కూటమితో  కలిసి నడుస్తుందన్న ప్రచారం జరిగంది.  సీట్ల సర్దుబాటు మాత్రమే తేలాల్సిన విషయం అన్న న్యూస్ వినిపించింది. కానీ చంద్రబాబు ఇలా రాగానే జగన్ అలా హస్తిన బాట పట్టడటంతో రాజకీయంలో పొత్తుల లెక్కలు మళ్లీ అయోమయంలో  పడ్డాయి.  ప్రధానితో  జగన్ గంటన్నర పాటు చర్చలు జరపడంతో.. కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

నిజానికి బీజేపీతో పొత్తు టీడీపీ నేతలకే కాదు చంద్రబాబుకు కూడా ఇష్టం లేదు. కానీ  గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు బీజేపీతో  పొత్తుకు రెడీ అయ్యారు. అటు పవన్ కళ్యాణ్ కూడా 2014 లో లాగే మరీసారి ఈ  పొత్తులు రిపీట్ అయితే.. వైసీపీని ఓడించడానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. దీనికోసమే ఏడాదిన్నరగా తాపత్రాయపడుతున్న  పవన్.. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు మాట్లాడేలా చూశారు.

అటు చంద్రబాబు అమిత్ షా తో కలిసిన తర్వాత.. ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఇంతలోనే సీఎం జగన్ ను కమలం పెద్దలు ఆహ్వానించి చర్చలు జరపడంతో..పొత్తుల లెక్కలలో తేడాలు వచ్చాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఢిల్లీ వెళ్లిన జగన్ కు ముందుగా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోడంతో..టీడీపీతో  పొత్తు ప్రభావం వల్లే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ మర్నాడు నేరుగా ప్రధాని మోడీతో జగన్ సమావేశమయి..  గంటన్నర పాటు చర్చలు జరపడంతో అసలు బీజేపీ వ్యూహం ఏంటన్న ప్రశ్నలు వినిపించాయి.

చంద్రబాబు, జగన్ బీజేపీ ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టీడీపీతో పొత్తుల గురించి చర్చలు జరుపుతూ.. జగన్ తో మంత్రాంగాలు ఏమిటని ఏపీ వ్యాప్తంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటు జగన్‌తో స్నేహంగానే ఉంటారు.. అటు పవన్‌తో పొత్తులో ఉంటూనే కొత్తగా టీడీపీతోనూ పొత్తుల కోసం చర్చలు జరుపుతారు. ఇంతకీ బీజేపీ ఏం చేయాలనుకుంటుందన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

మెజార్టీ ప్రజలు బీజేపీ తీరుతో  అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీరు సరికాదని ..ఇప్పటికే జనసేనతో పొత్తు వల్ల టీడీపీలో సీట్లు సర్ధుబాటు జరిగిందని తెలుగు తమ్ముళ్లు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి టీడీపీలో చాలామందికి  బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నచ్చలేదు. కానీ వైసీపీని ఓడించడానికి ఈ పొత్తులు తమకు ప్లస్ అవుతాయన్న లెక్కలతోనే కాంప్రమైజ్ అయ్యారు.

ఇప్పుడు పొత్తు విషయంలో బీజేపీ  క్లారిటీ ఇచ్చేవరకు సీట్ల సర్దుబాటు జరగదు. అప్పటివరకు టీడీపీ నేతల్లో టెన్షన్ తగ్గదు. ఇటు ఇప్పటికే  సీట్ల విషయంలో చంద్రబాబు ముందు బీజేపీ ఒక ప్రతిపాదన పెట్టినా.. దానికి చంద్రబాబు ఇంకా ఒప్పుకోలేదు.  పోనీ చంద్రబాబుతో పొత్తు కోసం ఒకవేళ బీజేపీ తక్కువ సీట్లకే ఒప్పుకోకుంటే పవన్ ఎవరి వైపు నిలుస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏపీలోని అన్ని పార్టీలను  బీజేపీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twenty =