ఏపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వైఎస్సార్‌సీపీ.. 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు

AP YSRCP Finalised Three Candidates To Contest in Graduate Elections of MLC, YSRCP Finalised Three Candidates To Contest in Graduate Elections of MLC, Three Candidates To Contest in Graduate Elections of MLC, Graduate Elections of MLC Contest, Graduate Elections of MLC, MLC Contest, Graduate Elections, Graduate MLC Elections in AP, AP Graduate MLC Elections, AP YSRCP Three Candidates, AP Graduate MLC Elections News, AP Graduate MLC Elections Latest News, AP Graduate MLC Elections Latest Updates, AP Graduate MLC Elections Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఖాళీ అవనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆమోదించారు. 2023 మార్చిలో 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలతో పాటు 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్‌ స్థానం ఒకటి, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్ మరియు టీచర్‌ స్థానం.. అలాగే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ మరియు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం సీఎం జగన్‌ మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు.

  • ఉమ్మడి విశాఖ– విజయనగరం–శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌ స్థానం – బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎస్‌.సుధాకర్‌ ఖరారు.
  • ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం – గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఖరారు.
  • ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్‌ స్థాస్థానం – వెన్నపూస రవి పేరు ఖరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =