విశాఖ పొలిటికల్ తెరపై బొత్స ఝాన్సీ పేరు

Botsa Jhansi is the Name on Visakha Political Screen, Visakha Political Screen, Botsa Jhansi Visakha Political Screen, Botsa Jhansi, Vizag, Botsa Jhansi is MP Candidate, Jhansi Name on Visakha Political Screen, Latest Visakha Political News, Visakha Political News Update, Botsa Jhansi Political News, TDP, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Botsa Jhansi,Vizag, Botsa Jhansi is MP candidate,Jhansi name on Visakha political screen

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్‌ దగ్గపడుతోండటంతో అన్ని పార్టీల కంటే ముందే.. అధికార వైసీపీ తమ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ..తాజాగా విశాఖ లోక్‌సభ నియోజవకర్గంలో బొత్స ఝాన్సీని రంగంలోకి దించడానికి పావులు కదుపుతోంది. నిజానికి ఆమె పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ.. ఈస్ట్‌ అసెంబ్లీ నుంచి  పోటీ చేస్తుండటంతో కొత్త అభ్యర్థి కోసం విస్తృత కసరత్తు చేసిన వైసీపీ చివరకు బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్రకు చెందిన  కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు ,  రాజకీయ కుటుంబం కావడం సానుకూల అంశాలుగా అధిష్ఠానం భావిస్తోంది. గతంలో జెడ్పీ చైర్మన్‌, రెండు సార్లు లోక్‌సభ ఎంపీగానూ పనిచేసిన అనుభవం  ఆమెకు ఉంది. ఝాన్సీ పోటీ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

మరోవైపు  ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థుల మార్పులు, చేర్పులను కొంతమంది నేతలు స్వాగతించలేకపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాస్‌పై వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారిని ఆరోపిస్తూ.. శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వొద్దని కోరారు. అంతేకాదు అరకు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా గొడ్డేటి మాధవిని  ఖరారు చేయడంపైన కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాధవికి కాకుండా స్థానికులకు టికెట్ ఇవ్వాలని అరకు నేతలు వైవీ సుబ్బారెడ్డిని  కోరారు.

అయితే  వైసీపీలో ఎలాంటి గొడవలు లేవని..చిన్న చిన్న భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఇటు బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేసే అంశంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడైనా పోటీ చేస్తామన్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీ చేస్తున్న ఎన్నికల కసరత్తు..ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =