ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు

AP School Education Department Issued Orders to Teachers on Tenth Class Exams

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారమే జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. తాజాగా పదోతరగతి పరీక్షల నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు కీలక సూచనలు జారీ చేసింది. ఈ సెలవులు సమయంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకు డిజిటల్‌ మార్గాల ద్వారా సహకరించాలని ఉపాధ్యాయులకు సూచించింది.

విద్యార్థులను సంప్రదిస్తూ ఆన్‌లైన్ ద్వారా వారి సందేహాలు తీర్చాలని చెప్పారు. అలాగే జూన్ 1 నుంచి 5 వరకు ఉపాధ్యాయులంతా పాఠశాలలకు హాజరు కావాలని, పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని చెప్పారు. పరీక్షల నిర్వహణతో పాటుగా విద్యార్ధుల సందేహాల నివృత్తి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని రీజినల్ డైరెక్టర్లను విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్దనే పరీక్షలకు మంచిగా సిద్ధం కావాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =