తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులతో చర్చించిన కేంద్ర బృందం

BRKR Bhavan, Central Team, Central Team At BRKR Bhavan, Central Team in Hyderabad, Central Team Met Telangana CS, Central Team Met Telangana CS Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులు, కరోనా నివారణకు అమలు జరుగుతున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం గచ్చిబౌలీ లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ కంటైన్మెంట్ ఏరియాను సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరీశిలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులతో సమావేశమై కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాలసిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై వైద్య శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరస్ నివారణ చర్యలను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేసింది మరియు ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం , కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మెనేజ్ మెంట్ పై సూచనలు చేసింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలల్లో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 5 =