ఏపీలో భారీ వర్షాలపై సీఎం జగన్‌ కీలక సమీక్ష.. నాలుగు జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున తక్షణ సాయం

CM Jagan Orders Rs 8 Cr Relief Measures For Four Districts After Review Meet on Heavy Rains in AP, AP CM Jagan Orders Rs 8 Cr Relief Measures For Four Districts After Review Meet on Heavy Rains in AP, AP CM YS Jagan Orders Rs 8 Cr Relief Measures For Four Districts After Review Meet on Heavy Rains in AP, 8 Cr Relief Measures For Four Districts After Review Meet on Heavy Rains in AP, Review Meet on Heavy Rains in AP, 8 Cr Relief Measures For Four Districts, Heavy Rains in AP Review Meet, Heavy Rains in AP, Relief Measures For Four Districts, Heavy Rains in AP News, Heavy Rains in AP Latest News, Heavy Rains in AP Latest Updates, Heavy Rains in AP Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. అలాగే గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను సీఎం జగన్ నియమించారు.

ఈ క్రమంలో వర్ష ప్రభావం అధికంగా ఉన్న అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.8 కోట్ల తక్షణ నిధులను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. చెరువులు, ఇరిగేషన్‌ కాల్వలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లపై పర్యవేక్షణతో పాటు వరద హెచ్చరిక ప్రాంతాల్లో బోట్లు, లైఫ్‌ జాకెట్లు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారు. ఒకవేళ అవసరమైతే వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయాలని కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 7 =