ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా జూన్ 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూరులో ‘జగనన్న విద్యా కానుక’ పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద విద్యా కానుక కిట్‌లను పంపిణీ చేయనున్నారు. అంతకుముందు అక్కడి స్థానిక ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం క్రోసూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్ రెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY