అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి

Telangana Cs Santhi Kumari Held Review Meeting On Prevention Of Blaze Mishaps In The State, Telangana Cs Santhi Kumari, Cs Santhi Kumari Review Meeting, Telangana Cs Santhi Kumari On Blaze Mishaps, Review Meeting On Prevention Of Blaze Mishaps, Mango News, Mango News Telugu, A Santhi Kumari Ias,Blast In Chamrajpet,Blast In Hyderabad,Blast In Hyderabad Today,Blast In Meghalaya,Blast In Tharagupet,K.Sathish Kumar,Santhi Kumari,Santhi Kumari Ias,Santhi Kumari Ias Profile,Shanthi Kumari,Telangana Assembly,Telangana Cm,Telangana Government,Telangana Map,Telangana Transport

వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు జరిగే అన్ని భవన సముదాయాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల సికిందరాబాద్ మినిస్టర్ రోడ్ లో జరిగిన అగ్నిప్రమాద నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో కమర్షియల్ కాంప్లెక్స్ లలో అగ్ని ప్రమాద నివారణ పరికరాలను, ప్రమాదాల పట్ల హెచ్చరికలు జారీ చేసే అలారం, తదితర మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కమర్షియల్ కాంప్లెక్స్ లలోని సెల్లార్లలో ఆక్రమణలను తొలగించడంతో పాటు, పేలుడుకు ఆస్కారం ఉన్న గ్యాస్ సిలిండర్లు, కెమికల్స్ తదితర పదార్థాలను ఉంచకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, తదితర ప్రజాసమూహం గల వాణిజ్య సముదాయాలలో ఈ విధమైన చర్యలను వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతీ వ్యాపార సంస్థ ఫైర్ సేప్టీ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలని, భారీ వాణిజ్య భవనాలలో సెల్లార్లలో గానీ, భవనం పైభాగంలో గానీ వాటర్ స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అయితే, ఈ జాగ్రత్తలను పాటించేందుకు తగు కాల పరిమితి విధించాలని సీఎస్ అన్నారు.

అగ్ని ప్రమాద నివారణ చర్యలపై తీసుకున్న చర్యలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను రూపొందించి ట్రేడ్ ల వారీగా అగ్ని ప్రమాద నివారణకై చేపట్టాల్సిన జాగ్రత్తలను ఈ యాప్ లో పొందుపర్చాలని అన్నారు. ప్రతీ కమర్షియల్ కాంప్లెక్స్ లో థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఫైర్ సేప్టీ ఆడిట్ నిర్వహించాలని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు, ప్రమాదాలు జరిగితే వెంటనే చేపట్టాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈవీడిఎమ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, ఫైర్ సర్వీస్ డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫిసర్ పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 5 =