బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం

Andhra’s Badvel Assembly bypoll, Badvel By-Election, By Election Date For Badvel Assembly Constituency, CM YS Jagan, CM YS Jagan held Special Meeting with Party Leaders, CM YS Jagan held Special Meeting with Party Leaders over Badvel By-Election, Mango News, YS Jagan Special Meeting with Party Leaders, YSRCP Files Former MLA’s Wife As Candidate

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ పేరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

తాడేపల్లిలో జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, కడప జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్వేలు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు సీఎం వైఎస్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ ఉపఎన్నికకు మండలాల వారీగా బాధ్యుల నియామకం, జిల్లా నాయకుల తోడ్పాటు, ప్రచారం వ్యూహం, తదితర అంశాలపై నాయకులతో సీఎం వైఎస్ జగన్ చర్చించనునట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =