రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్‌

CM YS Jagan Hosted Gala Dinner Party For The G20 Delegates at Visakhapatnam,CM YS Jagan Hosted Gala Dinner Party,G20 Delegates at Visakhapatnam,CM YS Jagan Dinner Party For The G20 Delegates,CM YS Jagan at Visakhapatnam,Mango News,Mango News Telugu,Four day G20 Meet Kicks off in Visakhapatnam,G20 Summit 2023,Next G20 Summit,G20 Summit Wikipedia,G20 Summit President,G20 Summit List,G20 Summit India,G20 Summit Date,G20 Summit 2024,G20 Summit 2022 India,AP G20 Summit 2023,Andhra Pradesh G20 Summit 2023,G20 Next Summit,CM YS Jagan Latest News

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన తమ ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా విశాఖలో గడిపే ప్రతి ప్రతి క్షణం వారి జీవితాలలో చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందని జీ-20 ప్రతినిధులతో పేర్కొన్నారు సీఎం జగన్. ఇక సదస్సులో భాగంగా సీఎం జగన్‌ ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఏపీలో తమ ప్రభుత్వం వచ్చాక 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, మరో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కొన్నిచోట్ల పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని, అయితే, ఈ గృహ సముదాయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని జీ-20 డెలిగేట్స్‌ కు వివరించారు. అందుకు వారి నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నామని, వారి ఆలోచనలు ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. వన్‌ ఎర్త్‌-వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఫ్యూచర్‌ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ జీ-20 సదస్సు ద్వారా సస్టెయిన్‌బుల్‌ పాలసీలతో సరైన మార్గనిర్దేశకత్వం చేయాలని ప్రతినిధులను కోరారు.

ఇక జీ-20 డెలిగేట్స్‌ తో ఇంట్రడక్షన్ కార్యక్రమం అనంతరం జీ-20 ప్రతినిధులకు మర్యాదపూర్వక విందు (గాలా డిన్నర్) ఇచ్చారు. కాగా ఈ సదస్సుకు జీ20 దేశాల సభ్యులతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన మరో 57మంది ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఇక సదస్సులో భాగంగా ఈరోజు యోగా, మెడిటేషన్‌, పౌష్టికాహార వినియోగం, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చలు జరుపనున్నారు. అలాగే రేపు స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, వేస్టే మేనేజ్‌మెంట్‌ అండ్ ఎనర్జీపై క్షేత్రస్థాయిలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఇక చివరి రోజు పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించనున్నారు. కాగా విశాఖ వేదికగా జరుగుతోన్న ఈ జీ-20 సదస్సుతో నగరానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here