ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు : సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, Balasubrahmanyam Death Anniversary, Balasubrahmanyam First Death Anniversary, CM YS Jagan Pays Tribute to SP Balasubrahmanyam on His First Death Anniversary, Mango News, S P Balasubrahmanyam Forever, S. P. Balasubrahmanyam, SPB Lives in Our Hearts Forever, Tribute To SP Balasubrahmanyam, Tribute to SP Balasubrahmanyam on His First Death Anniversary, YS Jagan Pays Tribute to SP Balasubrahmanyam

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేడు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసి, తన గానంతో దశాబ్దాల పాటు ఆబాలగోపాలాన్ని బాలసుబ్రహ్మణ్యం అలరించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =