సంక్రాంతిని తలపిస్తున్న పరిస్థితి

No Tickets Are Available To Go AP On May 10Th, No Tickets Are Available To Go AP, Summer Holidays, No Tickets Are Available, No Tickets, Go To AP On 10Th Of May, Sankranti Situation, AP Assembly Elections, Buses, Trians, Private Vehicals, Lok Sabha Elections, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
No tickets, go to AP on 10th of May, Sankranti situation,AP Assembly Elections, Buses, Trians, Private Vehicals

మే పదోతేదీకి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆరోజుకి ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకోవడంతో వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది.వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉండటంతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొంత మంది సొంత వాహనాలలో ఊరెళ్లడానికి రెడీ అవుతున్నారు.

నిజానికి మే 13న ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో.. మే పదో తేదీన టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. దీనికి తోడు వేసవిశెలవులు ప్రారంభం కావడంతో.. రెండూ కలిసి వస్తాయని సొంత ఊరెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు హైదరాబాద్ వాసులు. ఏపీలో ఓట్లు వేయడానికి కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండం వంటి ప్రాంతాల నుంచి కూడా బస్సులలో టికెట్లు బుక్ అయిపోయాయి.పోలింగ్ సోమవారం రోజు రావడంతో శని, ఆదివారాలు ఎలాగూ హాలీడేస్ కావడంతో..లాంగ్ వీకెండ్ పేరుతో ఇటు ఐటీ ఉద్యోగులు కూడా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

ఏపీకి చెందిన అనేక మంది ఉపాధి, ఉద్యోగాల కోసం తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ల ఓట్లు మాత్రం ఏపీలోనే ఉండటంతో పాటు అక్కడ సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారు కూడా ఇక్కడే ఉంటున్నారు. వీరిలో చాలామంది పింఛను ఇచ్చే మొదటి తేదీన ఏపీకి వెళ్లి పెన్సన్ తీసుకుని తిరిగి వస్తుంటారు.దీనికి తోడు ఓటుకు నగదు కూడా ఇస్తుంటారు. ఓటు వేయడానికి వెళ్లే వారి కంటే ఓటు కోసం ఆయా పార్టీల అభ్యర్థులు ఇచ్చే డబ్బుల కోసం ఊరెళ్లేవారే ఎక్కువ మంది ఉంటారు.

కొంతమందిని ప్రైవేటు వాహనాలలో సొంతూళ్లకు తీసుకువచ్చి.. ఓటు వేయించే బాధ్యతను కొన్ని పార్టీల కార్యకర్తలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఆరోజు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా మొత్తం మీద మే పది నుంచి 13 వరకూ సంక్రాంతిని తలపించేలా హైదరాబాద్ రోడ్లు ఉంటాయనమన అంచనాలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =