పవన్‌తో హరిరామ జోగయ్య కీలక భేటీ

Harirama Jogaiahs crucial meeting with Pawan,Harirama Jogaiahs crucial meeting,crucial meeting with Pawan,Jogaiahs crucial meeting,Janasena, Pawan kalyan, Hari rama Jogayya, AP Assembly elections,Mango News,Mango News Telugu,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,YCP tickets Latest News
Janasena, Pawan kalyan, Hari rama Jogayya, AP Assembly elections

ఏపీలో కాపులంతా ఒక్కటవుతున్నారా..? వైసీపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు కాపు నేతలంతా జనసేన వైపు చూస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు పట్టుమని పదిరోజులు కూడా కాకముందే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. జనసేనానితో చర్చలు జరిపారు. త్వరలో అంబటి జనసేనలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు కాపు ఉద్యమనేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా మొన్నటి వరకు వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కూడా మనసు మార్చుకున్నారు. జనసేన వైపు చూస్తున్నారట. త్వరలో ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇలా కాపు నేతల వ్యవహారం ఏపీలో కాక రేపుతున్న క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకంది. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. అసెంబ్లీ ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు.. టీడీపీతో పొత్తు వంటి అంశాలతో చర్చలు జరిపారట. వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రవేశపెట్టాల్సిన పథకాలను పవన్‌కు వివరించారట. ఈసారి ఎన్నికల్లో జనసేన తప్పకుండా విజయం సాధించాలని హరిరామ జోగయ్య ఆకాంక్షించారట.

అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న సామాజిక.. రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారట. కాపు సామాజిక ఓటు బ్యాంకు చీలిపోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హరిరామ జోగయ్య జనసేనానికి సూచించారట. అలాగే టీడీపీతో సీట్ల పంపకాలపై కూడా చర్చించారట. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని సూచించారు. సీట్ల పంపకాల విషయంలో ఎటువంటి మొహమాటాలకు వెళ్లొద్దని.. ముఖ్యమంత్రి పదవిపైనా వెనుకంజ వేయొద్దని జోగయ్య అన్నారట. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని.. ఆ కలను నిజం చేయాలని పవన్ కళ్యాణ్‌ను హరిరామ జోగయ్య కోరారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =