కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సందర్భాలు లేదా అవసరమైన పనుల కోసం ప్రయాణంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ సూచనల మేరకు ఏపీ పోలీస్ విభాగం అత్యవసర వాహన పాస్‌లను జారీ చేస్తుంది.
జిల్లా పరిధిలో ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్‌లు కావాలంటే ముందుగా జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేయాలి. అలాగే జిల్లా పరిధి దాటి వేరే జిల్లాకు వెళ్లాలనుకుంటే సొంత జిల్లా ఎస్పీ ద్వారా వెళ్లాలనుకున్న జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితిలో జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ ఆఫీసుకి అప్లై చేసుకోవాలి. అవసరమున్న వ్యక్తులు సమర్పించిన దరఖాస్తులను పోలీసులు పరిశీలించి సరైన కారణాలు ఉంటే ప్రయాణానికి ఈ-పాస్ మంజూరు చేస్తారు. పూర్తీ పేరు, అడ్రస్, ఆధార్ నెంబర్, వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, బయలుదేరే చోటు, వెళ్లాల్సిన చోటు, వంటి వివరాలతో జిల్లావారీగా ప్రకటించిన వాట్సప్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఆయా వ్యక్తుల మొబైల్ నెంబర్లకే ఇ-పాస్‌లను పంపిస్తారు. ప్రయాణ సందర్భంగా తనిఖీల సమయంలో ఈ ఈ-పాస్ లను పోలీసులకు చూపించాల్సి ఉంటుంది.
ఈ-పాస్ దరఖాస్తు చేసేందుకు జిల్లాల వారీగా వివరాలు:
–>శ్రీకాకుళం
- వాట్సప్ నెంబర్ : 6309990933
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>విశాఖపట్నం రూరల్
- వాట్సప్ నెంబర్ : 9440904229
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>విశాఖపట్నం సిటీ
- వాట్సప్ నెంబర్ : 9493336633
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>తూర్పు గోదావరి (కాకినాడ)
- వాట్సప్ నెంబర్ : 9494933233
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>రాజమండ్రి అర్బన్
- వాట్సప్ నెంబర్ : 9490760794
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>పశ్చిమ గోదావరి
- వాట్సప్ నెంబర్ : 8332959175
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>కృష్ణా (మచిలీపట్నం)
- వాట్సప్ నెంబర్ : 9182990135
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>విజయవాడ సిటీ
- వాట్సప్ నెంబర్ : 7328909090
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>గుంటూరు రూరల్
- వాట్సప్ నెంబర్ : 9440796184
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>గుంటూరు అర్బన్
- వాట్సప్ నెంబర్ : 8688831568
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>ప్రకాశం
- వాట్సప్ నెంబర్ : 9121102109
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>నెల్లూరు
- వాట్సప్ నెంబర్ : 9440796383
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>చిత్తూరు
- వాట్సప్ నెంబర్ : 9440900005
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>తిరుపతి అర్బన్
- వాట్సప్ నెంబర్ : 9491074537
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>అనంతపురం
- వాట్సప్ నెంబర్ : 9989819191
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>కడప
- వాట్సప్ నెంబర్ : 9121100531
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>కర్నూల్
- వాట్సప్ నెంబర్ : 7777877722
- ఇమెయిల్-ఐడీ : [email protected]
–>విజయనగరం
- వాట్సప్ నెంబర్ : 9989207326
- ఇమెయిల్-ఐడీ : [email protected]
To facilitate people facing hurdles in travel in cases of emergency or for essential services, #APpolice based on instructions of Government morning will issue emergency vehicle passes. The procedure and contact details are mentioned in the photos attached to this post. pic.twitter.com/A8qSdU9s6o
— AP Police #MainBhiHarjeetSingh (@APPOLICE100) April 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]