ఈ పొత్తూ.. జ‌గ‌న్ ను చిత్తు చేసేందుకేనా?

Is This Alliance To Destroy Jagan?,Telugu Desam,Janasena,BJP,Chandrababu Naidu,TDP,Janasena,YSRCP,Pawan Kalyan,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,CM YS Jagan,CM Jagan,CM Jagan News,CM Jagan Latest News,CM Jagan Bus Yatra,Siddham,CM YS Jagan Bus Yatra,CM YS Jagan Live,CM YS Jagan Election Campaign,CM YS Jagan Speech,AP Political News

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను గ‌ద్ది దించేందుకు రాజ‌కీయ శ‌క్తుల‌న్నీ ఏకం అవుతున్నాయి. తెలుగుదేశం-జ‌న‌సేన‌-బీజేపీ మూడు పార్టీలూ అదే ల‌క్ష్యంగాతో క‌లిసి.. ల‌క్ష్య‌సాధ‌న‌లో ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడి నివాసంలో జ‌రిగిన స‌మావేశంలో కూడా మూడు పార్టీల నాయ‌కులూ ఆ అంశంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చించారు. కూట‌మిలోని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను చక్క‌దిద్దుకుని.. క‌లిసిక‌ట్టుగా జ‌గ‌న్ ను గ‌ద్దె దించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నాయి.

కూట‌మి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మ‌రోవైపు జ‌గ‌న్ చెల్లి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల సైతం వైసీపీ టార్గెట్ గా ప్ర‌చారం సాగిస్తున్నారు. తాజాగా ఇప్పుడు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా సీపీఎం తరపున ఒక ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడేది తమ పార్టీ మాత్రమేనని ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. తామంతా కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు.

అయితే.. ఈ పొత్తు కూడా జ‌గ‌న్ ను ఓడించ‌డానికేనా అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఆ విష‌యంలో ష‌ర్మిల ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీగానే ప్ర‌చారం సాగిస్తున్నారు. ష‌ర్మిల‌తో వామ‌ప‌క్షాలు పొత్తు పెట్టుకోవ‌డంతో ఈ త‌రహా చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. బీజేపీతో క‌ల‌వ‌డంతో చంద్ర‌బాబును, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీపీఎం నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శించారు. ఏపీకి కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీతో ఏ మొహం పెట్టుకుని పొత్తు పెట్టుకున్నార‌ని సూటిగా ప్ర‌శ్నించారు. రాష్ట్ర భ‌విష్య‌త్‌ను ఢిల్లీలో తాక‌ట్టుపెట్టార‌ని అన్నారు. ఈనేప‌థ్యంలో కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టిన క‌మ్యూనిస్టులు.. టీడీపీ కూట‌మికి వ్య‌తిరేకంగా పోర‌డ‌తారా.., వైసీపీకి వ్య‌తిరేకంగా పోరాడ‌తారా.. అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే పొత్తు పార్టీ కాంగ్రెస్‌.. జ‌గ‌నే ప్ర‌ధాన టార్గెట్ గా ముందుకు సాగుతోంది. తెలుగుదేశంపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నా.., నామ‌మాత్రంగానే క‌నిపిస్తోంది. మ‌రి క‌మ్యూనిస్టులేమో ఇప్ప‌టివ‌ర‌కు కూట‌మిని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌-క‌మ్యూనిస్టుల పొత్తు నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఏజెండా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =