27 మంది ఇంఛార్జ్‌లను మార్చిన జగన్.. రెండో జాబితా ఇదే..

Jagan Has Changed 27 Incharges This Is The Second List, Jagan Has Changed 27 Incharges, 27 Incharges Second List, Jagan Changed 27 Incharges, Second List Incharges, YCP, CM Jagan, YCP Second List, AP Assembly Elections, Latest YCP Incharges News, YCP Incharges News Update, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YCP, CM Jagan, YCP Second list, AP Assembly elections

వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్‌లను జగన్ మార్చేశారు. ఆ అంశం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. ఇదే సమయంలో.. ఆ వేడి తగ్గకముందే జగన్ రెండో జాబితాను కూడా ప్రకటించేశారు.  మరో 27 స్థానాలకు కూడా కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొందరు సిట్టింగ్‌లను వేరే స్థానాలకు మార్చితే.. మరికొందరిని పక్కన పెట్టేశారు. అలాగే ఈ జాబితాలో కొందరు ఎంపీలకు స్థానం కల్పించారు. కొందరు సీనియర్ నేతల వారసుల పేర్లు కూడా రెండో జాబితాలో చేర్చారు.

ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ సెగ్మెంట్ ఇంఛార్జ్‌గా నియమించారు. ఎంపీ వంగా గీతను పిఠాపురం సెగ్మెంట్ ఇంఛార్జ్‌గా.. ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు ఇంఛార్జ్‌గా.. ఎంపీ తలారి రంగయ్యను కల్యాణదుర్గం ఇంఛార్జ్‌గా నియమించారు. అలాగే ఈసారి ఐదుగురు పార్టీ సీనియర్ల వారసులకు జగన్ అవకాశం కల్పించారు. బందర్ ఇంఛార్జ్‌గా పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి.. చంద్రగిరి ఇంఛార్జ్‌గా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని నియమించారు. అలాగే భూమన కుమారుడు అభినయ్‌ను తిరుపతి ఇంఛార్జ్‌గా.. పిల్లి సుభాష్ బోస్ కుమారుడు సూర్య ప్రకాష్‌ను రామచంద్రాపురం ఇంఛార్జ్‌గా.. షేక్ ముస్తఫా కూతురు నూరి ఫాతిమాను గుంటూరు ఈస్ట్ ఇంఛార్జ్‌గా నియమించారు.

వైసీపీ కొత్త ఇంచార్జ్‌ల జాబితా..

రామచంద్రాపురం : పిల్లి సూర్య ప్రకాశ్

పిఠాపురం : వంగా గీత

రాజమండ్రి సిటీ : మార్గాని భరత్

అరకు : గొడ్డేటి మాధవి

కల్యాణదుర్గం : తలారి రంగయ్య

బందర్ : కృష్ణమూర్తి

రాజాం : తాళ్ల రాజేష్

పాయకరావు పేట : కంబాల జోగులు

అనకాపల్లి : మలశాల భరత్ కుమార్

పి.గన్నవరం : వేణుగోపాల్

జగ్గంపేట : తోట నర్సింహం

విజయవాడ సెంట్రల్ : వెలంపల్లి శ్రీనివాస్

ప్రత్తిపాడు : వరుపుల సుబ్బారావు

విజయవాడ వెస్ట్ : షేక్ ఆసీఫ్

పోలవరం : తెల్లం రాజ్యలక్ష్మి

రాజమంండ్రి రూరల్‌ : చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ

కదిరి :మక్బూల్‌ ఆహ్మద్‌

ఎర్రగొండపాలెం : తాటిపర్లి చంద్రశేఖర్‌

తిరుపతి : భూమన అభినయ్ రెడ్డి

పెనుకొండ : ఉషా శ్రీ చరణ్

ఎమ్మిగనూర్‌ : మాచాని వెంకటేశ్‌

చంద్రగిరి : చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

విజయవాడ సెంట్రల్ : వెలంపల్లి శ్రీనివాస్

పాడేరు : విశ్వేశ్వర రాజు

అనంతపురం ఎంపీ : మాలగుండ్ల శంకరనారాయణ

హిందూపురం ఎంపీ : జోలదరాశి శాంత

అరకు ఎంపీ : కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − one =