జనవరి 22న రామజ్యోతిని వెలిగించండి..

Light The Rama Jyothi On 22nd January, Rama Jyothi On 22nd January, Light The Rama Jyothi, 22nd January Rama Jyothi, Ram Jyothi, Every House Is Ramajyoti, Modi, Latest Rama Jyothi News, Rama Jyothi News Update, Ayodhya, Modi, Latest Ayodhya News, Ayodhya News Update, Mango News, Mango News Telugu
Ram Jyothi ,Every house is Ramajyoti,Light the Rama Jyoti on 22nd January, Modi

అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. కల సాకారమవుతుండటంతో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సందేశం ఇచ్చారు.అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అంటే దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని  మోడీ అభిప్రాయపడ్డారు. అందుకే జనవరి 22వ తేదీన రాత్రి దేశమంతా ప్రతీ ఇంట దీపాలు వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట్లో రామ జ్యోతి వెలిగించి దీపావళి వేడుకలుగా జరుపుకోవాలని మోడీ సూచించారు.

అలాగే జనవరి 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కూడా  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని, జనవరి 23 తర్వాత ప్రజలంతా అయోధ్యకు రావొచ్చని తెలిపారు. అయోధ్యను శుభ్రంగా ఉంచే బాధ్యత అయోధ్య వాసులదే అని చెప్పిన ప్రధాని మోడీ.. అయోధ్యధామ్‌లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించకూడదని కోరారు.

ఒకప్పుడు అయోధ్యరాముడు  టెంట్‌లో ఉండేవాడని, ఇప్పుడు భవ్య రామమందిరంలో స్వామివారిని ప్రతిష్టించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు ప్రధాని. అంతేకాదు అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం ఆనందంగా ఉందన్నారు.శ్రీరాముడు చేసిన మంచి కార్యాలను రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి..  మనకు పరిచయం చేశారని మోడీ గుర్తు చేశారు.

ఆధునిక భారత్‌‌లో, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ రెండు కూడా రామమందిరంతో మన అందరినీ కలుపుతాయన్నారు. ప్రస్తుతం అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు 10 వేల నుంచి 15 వేల మందికి సేవలందించే సామర్థ్యం ఉందన్నారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, ప్రతి రోజూ 60 వేల మంది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించొచ్చని మోడీ తెలిపారు.

ఇప్పటికే అయోధ్య రామయ్య అక్షింతలను దేశవ్యాప్తంగా చాలామందికి అందే ఏర్పాట్లు చేశారు ట్రస్ట్ సభ్యులు. రామమందిరం ప్రారంభోత్సం రోజు సాయంత్రం 5 దీపాలు పెట్టి రెండు దేవుని మందిరంలోనూ.. రెండు దీపాలు రామయ్య అక్షింతలు ముందు, మరో దీపం తులసమ్మ ముందు పెట్టాలని కోరుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =