కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ విరాళాల వెల్లువ

Celebrities donate to fight Coronavirus, Coronavirus, Coronavirus Crisis, Coronavirus Donations, Coronavirus Fight, Coronavirus outbreak, Telugu film actors, TFI Celebrities, TFI Celebrities Donations, TFI Celebrities Donations For Coronavirus, TFI Celebrities Large Scale Donations

దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13 నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వంతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయనిధులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. అలాగే ఈ ప్రతికూల సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకునేందుకు కూడా పలువురు హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, సినీ ప్రముఖులు తమ వంతుగా అధిక మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను పాటిస్తూ, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్లోద్దని సూచించారు.

కరోనాపై పోరాటానికి విరాళం ప్రకటించిన తెలుగు సినీ ప్రముఖులు:

 • చిరంజీవి: రూ. 1 కోటి
 • ప్రభాస్: రూ. 4 కోట్లు
 • పవన్ కళ్యాణ్: రూ. 2 కోట్లు
 • అల్లు అర్జున్: రూ. 1 .25 కోట్లు
 • మహేష్ బాబు: రూ. 1 .25 కోట్లు
 • దగ్గుబాటి ఫామిలీ: రూ. 1 కోటి
 • అక్కినేని నాగార్జున : రూ. 1 కోటి
 • జూ. ఎన్టీఆర్: రూ. 75 లక్షలు
 • రామ్ చరణ్: రూ. 70లక్షలు
 • నితిన్: రూ. 20 లక్షలు
 • త్రివిక్రమ్: రూ. 20 లక్షలు
 • కొరటాల శివ: రూ. 10 లక్షలు
 • అనిల్ రావిపూడి: రూ. 10 లక్షలు
 • వీవీ వినాయక్: రూ. 5 లక్షలు
 • దిల్ రాజు: రూ. 10 లక్షలు
 • మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ: రూ. 20 లక్షలు
 • సాయి ధరమ్ తేజ్: రూ. 10 లక్షలు
 • సుకుమార్: రూ. 10 లక్షలు
 • సుదీర్ బాబు: రూ. 2 లక్షలు
 • తమన్: రూ. 5 లక్షలు
[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here