జనసేన ఆఫీసులో సరస్వతి పూజ నిర్వహించిన పవన్ కళ్యాణ్, అక్టోబర్ లో కార్యక్రమాలపై ముఖ్య నిర్ణయాలు

Janasena Chief Pawan Kalyan Performs Saraswati Puja at Party Office Hyderabad, Pawan Kalyan Organized Saraswati Puja , Janasena Office, Important Decisions On Programs In October, Janasena Chief Pawan Kalyan, Mango News, Mango News Telugu, Pawan Kalyan Organized Saraswati Puja, Pawan Kalyan Saraswati Puja, Pawan Kalyan Saraswati Puja At Janasena Office, Pawan Kalyan, PSPK Pawan Kalyan, Pawan Kalyan Dushera Celebrations, Pawan Kalyan Latest News And Updates, Pawan Kalyan News And Live Updates

శరన్నవ రాత్రి పర్వదినాల్లో భాగంగా పంచమి తిధిని పురస్కరించుకొని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరస్వతి పూజ నిర్వహించారు. శుక్రవారం ప్రభాత సమయాన శాస్తోక్తంగా పూజాదికాలు చేపట్టారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెల్లవారుజామునే హైదరాబాద్ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాలకు సకల శుభాలు కలుగ చేయాలని ప్రార్థించారని తెలిపారు. పూజానంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ నిర్వాహకులతో సమావేశమై అక్టోబర్ మాసంలో పార్టీపరంగా నిర్వహించ తలపెట్టిన సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశాలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వాలంటీర్లు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

“సోషల్ మీడియా-శతఘ్ని క్రియాశీలక సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. జిల్లాలవారీగా సమీక్షలు చేపట్టబోతున్నారు. ఈ సమీక సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్ లతో మొదలవుతాయి. నా సేన నా వంతు కార్యక్రమంపై సమీక చేపట్టనున్నారు. రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబందించి సన్నాహకాలపై ముఖ్య నేతలతో సమాలోచన జరుపుతారు. గతంలో సంకల్పించిన అనుష్టుప్ నారసింహ యాత్ర చేపట్టడంపై ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చర్చించారు. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి, దర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విదంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, ఎ.వి.రత్నం, పి.హరిప్రసాద్, షేక్ రియాజ్, యాతం నగేష్, తంగళ్ల ఉదయ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =