టీడీపీ అధినేత చంద్రబాబు అనపర్తి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds Over Tension During TDP President Chandrababu Anaparthi Visit,Mango News,Mango News Telugu,Pawan Kalyan,Pawan Kalyan Live,Pawan Kalyan Live Updates,Pawan Kalyan Latest News,Pawan Kalyan News,Pawan Kalyan Latest Updates,Pawan Kalyan Live News,Pawan Kalyan Latest,Janasena Chief Pawan Kalyan,Janasena,Janasena Party,TDP President Chandrababu,Chandrababu,Anaparthi Visit,TDP President Chandrababu Anaparthi Visit,Pawan Kalyan Responds Over Chandrababu Anaparthi Visit,Pawan Kalyan On Chandrababu Anaparthi Visit,Pawan Kalyan Supports to Chandrababu,Pawan Kalyan Comments On Chandrababu's Anaparthi Visit,Chandrababu Public Meeting At Anaparthi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేతల పర్యటనల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు పాదయాత్రగా ముందుకు సాగారు. కాగా అనపర్తి దేవీచౌక్‌ వద్ద రోడ్‌ షోకు గురువారం అనుమతి ఇచ్చిన పోలీసులు శుక్రవారం అనుమతి నిరాకరించారు. అనపర్తి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను బలభద్రాపురం వద్ద అడ్డుకున్న పోలీసులు అడ్డంగా పోలీసు వాహనాన్ని పెట్టి ముందుకు కదలకుండా చేశారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ దిగి పాదయాత్రగా అనపర్తి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్న తీరును తప్పుబట్టారు. సాధారణంగా ఎవరైనా గొడవ చేస్తే పోలీసులు అడ్డుకోవాలని, రాజకీయ నేతల రాకపోకలకు రక్షణ కల్పించాలని చెప్పిన పవన్.. ఇలా ప్రతిపక్ష నేత పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉందని, ఆయన రెండు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తుచేశారు. ఒక పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రజలను కలుసుకునే అర్హత లేదా? అని పవన్ ప్రశ్నించారు.

సాధారణంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతారని, కానీ విధి నిర్వహణలో ఉన్న పోలీసులే రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది ఉంటుందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఇక తాను గతంలో జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళ్లినప్పుడు కూడా లైట్లు ఆపేశారని, హోటల్ లోనే నిర్బంధం చేశారని తెలిపారు. అలాగే ఇప్పటంలోనూ ఇళ్ళు కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కూడా ఇలాగె ఆంక్షలు విధించారని, ప్రజల సమస్యలపై విపక్షాల గొంతు వినిపిస్తే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 2 =