కూటమి మద్దతుతో దూకుడు పెంచిన జనసేనాని

Janasena Who Increased Aggression With The Support Of The Alliance, Janasena Who Increased Aggression, Janasena Alliance Increased Aggression, Pawan,Janasena, Support of the Alliance,TDP, Janasena, YCP, Congress, BJP, Pawan Kalyan, Chandrababu, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pawan,Janasena, support of the alliance,TDP, Janasena, YCP, Congress, BJP, Pawan Kalyan, Chandrababu,

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కసి పవన్‌లో రోజురోజుకు పెరిగిపోతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అదే ధ్యేయంతో పావులు కదుపుతున్నారు.  గతంలో ఒక్క సీటుకి పరిమితమైన జనసేన.. ఇప్పుడు 21 స్థానాల్లో విజయంపై కన్నేసింది. 21 స్థానాల్లో గెలుపు వ్యూహ రచన.. అదే సమయంలో టీడీపీ, బీజేపీ కేడర్ సమన్వయానికి పవన్ రచించే వ్యూహాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీ ప్రయోజనాలు.. యువత భవిష్యత్తు..  పవన్ ప్రస్తావించే ప్రధాన అంశాలివి. సభ ఏదైనా సందర్భం ఎక్కడైనా.. లోకల్ సమస్యల్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తూ వస్తున్నారు. సమస్యలు తన దాకా రావడం కాదూ.. తనే సమస్యల దగ్గరకు పరుగు పెట్టారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని సమస్యకు మూలాలను వెతికి పట్టుకుని ప్రభుత్వం ముందుంచారు. ఈ క్రమంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి పనిచెబితే.. అందుకు తగ్గట్టే లెఫ్ట్ రైట్ ఇచ్చారు. ఇదే పవన్ ను జనానికి దగ్గర చేసింది. 2014లో పొత్తుతో వెళ్లారు. పోటీ చేయకుండా మద్దతు మాత్రమే ఇచ్చారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కింది. ఇక తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు పవన్.

నాయకుడు ఓడిపోతే ఆ ప్రభావం కేడర్ పై ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తనకు తాను మానసికంగా బిల్డప్ అవడమే కాకుండా.. శ్రేణుల్ని కూడా ఆ రకంగా సన్నద్ధం చేయాలి. పవన్ అదే చేశాడు. ఓటమితో కుంగిపోలేదు.. తన లక్ష్యమేంటో క్లియర్ కట్ గా వివరించారు. ఆ దిశగానే అడుగులు వేస్తూ భరోసానిచ్చాడు. గెలుపోటములు లెక్కచేయకుండా ఐదేళ్లు ప్రజల్లో ఉంటూ వచ్చారు. ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపారు. వైఫల్యాలను ఎండగట్టారు. ప్రభుత్వాన్ని నడిపించే తీరు ఇది కాదని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే తన బలం సరిపోదని గ్రహించిన పవన్ పొత్తులే శరణ్యమని భావించారు. టీడీపీ బీజేపీని ఒక్కటి చేసి ఎన్నికల సంగ్రామానికి సిద్ధమయ్యారు.

2019 ఎన్నికల్లో పవన్ ఎక్క఼డ అడుగు పెడితే అక్కడ జన ప్రవాహం కనిపించింది. కానీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఈసారి అది రిపీట్ కావొద్దన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు జనసేన ఓటింగ్ పర్సెంటేజ్, గ్రాఫ్ గతంతో పోల్చుకుంటే ఈసారి పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవడం తోపాటు ప్రచార సభలకు వస్తున్న జనం ఓట్లను రాబట్టుకునే వ్యూహాలను రచిస్తోంది. ఇది సక్సెస్ అయితే 21కి 21 సీట్లు గెల్చుకోవడం పెద్ద కష్టమేం కాదని జనసేన లెక్కలేసుకుంటోంది.

2 సీట్లు గెలవాలంటే కేవలం జనసైనికులతో పాటు టీడీపీ ఇటు బీజేపీ నేతల సమన్వయంతో పాటు ఓట్ షేరింగ్ కూడా జరగాలి. దీనిపైనే పవన్ ఫోకస్ చేయబోతున్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఎవరైనా, ఏ స్థానంలో పోటీ చేస్తున్నా వారికి వందశాతం జనసేన నుంచి పూర్తి మద్దతు, సహకారం ఉంటుంది. అలాగే ఓట్లను కూడా రాబడుతుంది. ఈ స్పిరిటే ఆ రెండు పార్టీల నుంచి రావాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ సారి ఆ విషయంలో సక్సెస్ అయితే గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరిలు తమ కేడర్ కు స్పష్టమైన సంకేతాలు, కొంతమంది నేతలకు ప్రత్యేకంగా సమన్వయ బాధ్యతల్ని అప్పగిస్తే.. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పవన్  ప్రతీ భేటీలోనూ చెబుతూ వస్తున్నారని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 7 =