నగరిలో చోటు లేదంటున్న సొంతపార్టీ నేతలు

YCP leaders, Minister Roja, Nagari Minister, Tirupathi, Ycp, TDP, Congress, Janasena, Roja,Andhra Pradesh News Updates, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
YCP leaders, Minister Roja, Nagari Minister, Tirupathi, Ycp, TDP, Congress, Janasena, Roja

ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు చెప్పారు.  మంత్రి రోజాకు ఇప్పుడు ఇదే వర్తిస్తుంది.  వచ్చే ఎన్నికలలో తన గెలుపు సంగతి అటుంచితే..నగరిలో సొంతపార్టీ నేతల పోరు రోజురోజుకు ఎక్కువ అవుతుంది. దీంతో గెలవడం మాట పక్కన పెడితే..అసలు ఈ ఎన్నికలలో సీటు దక్కుతుందో లేదోనన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి.

తిరుపతి జిల్లా నగరిలో ర తాజాగా వైసీపీ వర్గ పోరు భగ్గుమంది. మంత్రి రోజాకు ఈ  ఎన్నికల్లో టికెట్ ఇస్తే మాత్రం తాము కచ్చితంగా ఓడిస్తామని సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోంది.   రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అయితే   నగరి నియోజకవర్గంలో ఆమె చేసిన అభివృద్ధి శూన్యం అనే టాక్ బీభత్సంగా ఉంది.

దీంతోపాటు తన నోటి దురుసుతో, ప్రవర్తనతో  పార్టీలోని సొంత నేతలను, కార్యకర్తలను రోజా  పక్కన పెట్టారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.  దీంతో ఎన్నికల సమయంలో అండగా ఉండాల్సిన  సొంత పార్టీ నేతలే..రోజాకు  వ్యతిరేక వర్గంగా మారారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్..  రోజాకు కనుక మళ్లీ సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమంటూ తేల్చి చెప్పేస్తున్నారు. అంతేకాదు నగరిలో రోజాకు కాకుండా  వేరే ఎవరికి సీటు ఇచ్చినా వారి గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని అంటున్నారు.

మరోవైపు ఇప్పటికే  9 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం..నగరి సీటుపై మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌నే కొనసాగిస్తోంది.అయితే ఈసారి విడుదల చేయబోయే 10 వ జాబితాలో   లిస్టులో నగరి ఇంచార్జి పేరు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో రోజా పేరు ఉంటుందనే అనుమానంతో నగరి నియోజకవర్గం నేతలు తాజాగా ఆందోళనకు దిగడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతితో పాటు.. పుత్తూరు మండలం అమ్ములు, నిండ్ర, చక్రపాణిరెడ్డి, విజయపురంలో రాజు, వడమాల పేటలో మురళి రెడ్డి  రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మన దేశాన్ని కొల్లగొట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కూడా రోజా, ఆమె సోదరులు దోచుకున్నంతగా దోచుకోలేదని బహిరంగ  విమర్శలకు దిగుతున్నారు. రోజాకు ఈ రేంజ్‌లో ఇంటిపోరు ఉండటంతో .. వైఎస్ జగన్ ఆమెకు ఈసారి సీటు ఇస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =