నాడు-నేడు పథకానికి పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం, సీఎం జగన్ కు చెక్ అందజేత

Pokarna Group Donates Rs 1 Crore to Connect to Andhra for Nadu-Nedu Project,Pokarna Group Donates Rs 1 Crore, Andhra for Nadu-Nedu Project,Pokarna Group Donates Rs 1 Crore to Connect to Andhra,Nadu-Nedu Project,Pokarna Group, 1 Crore to Connect to Andhra for Nadu-Nedu Project, Nadu-Nedu Project,AP Nadu-Nedu Project,Nadu-Nedu Project In AP,Andhra Pradesh CM YS Jagan Mohan Reddy,mango news

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలల్లో నాడు-నేడు పథకానికి భారీ విరాళం అందింది. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టూ ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం అందించింది. ఈ మేరకు పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకుని విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =