శ్రీహరికోటలోని షార్ సెంటర్లో కరోనా కలకలం.. 2 రోజుల్లో 200 మందికి కోవిడ్ పాజిటివ్

ISRO's Sriharikota Space Centre Reports Over 200 Covid-19 Positive Cases,ISRO's Sriharikota Space Centre, Covid-19 Positive Cases,Sriharikota Space Centre Reports Over 200 Covid-19 Positive Cases , 200 Covid-19 Positive Cases In ISRO's Sriharikota Space Centre ,ISRO's Sriharikota Space Centre Reports Covid-19 Cases,Covid sweeps ISRO's rocket station,Sriharikota space centre reports Covid-19 cases,Sriharikota Space Centre ,Covid-19 News,ISRO,Mango News

ఆంధ్రప్రదేశ్ ను కరోనా భయపెడుతోంది. అన్ని జిల్లాల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే రోజు వారి కేసుల సంఖ్య ఆరు వేల మార్కును దాటింది. తాజాగా శ్రీహరికోట లోని షార్ కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఊహించని స్థాయిలో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇక్కడ కేవలం రెండు రోజుల్లో రెండొందల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. షార్ సెంటర్ లో నిన్న ఒక్క రోజే 90 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు మరో 140 మందికి పైగా కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. అంటే కేవలం 24 గంటల వ్యవధిలో అక్కడ 200లకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దీంతో కీలక ప్రయోగాలకు బ్రేక్ పడక తప్పడం లేదు.

గతంలోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు అవ్వడంతో.. అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిత్య శానిటైజ్ చేయడంతో పాటు భౌతిక దూరం ఉండేలా షిఫ్ట్ లు ఎడ్జెస్ట్ చేశారు. షిఫ్ట్స్ కూడా అతి తక్కువ మందితో నడిపిస్తున్నారు. పండుగకు ఊరు వెళ్లిన వారందరూ తిరిగి విధుల్లోకి చేరుకుంటున్నారు. దీంతో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో 50 శాతానికి పైగా కరోనా బారిన పడుతున్నారు. ఈ సంవత్సరం ఇస్రో ఎన్నో కీలక ప్రయోగాలు చేయటానికి ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రయోగాలన్ని వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eight =