ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

AP Govt, AP Govt Issues Orders over Appointment of Ex-DGP Gautam Sawang, AP Govt Issues Orders over Appointment of Ex-DGP Gautam Sawang as APPSC Chairman, APPSC Chairman, EX-DGP Gautam Sawang, EX-DGP Gautam Sawang as APPSC Chairman, Former Andhra DGP Gautam Sawang appointed as APPSC, Gautam Sawang as APPSC Chairman, Govt Issues Orders over Appointment of Ex-DGP Gautam Sawang as APPSC Chairman, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా నాలుగు క్రితం రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించిన గౌతమ్‌ సవాంగ్‌ ను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్‌ సవాంగ్‌ స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీ సమయంలో గౌతమ్‌ సవాంగ్‌ ను సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

తాజాగా గౌతమ్‌ సవాంగ్‌ కు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు డీజీపీగా బదిలీ అయిన గౌతమ్ సవాంగ్‌ కు శనివారం ఉదయం మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌతమ్ సవాంగ్ మరియు నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 10 =