ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం.. భర్త విద్యాసాగర్ మృతి

Famous South Indian Actress Meena's Husband Vidyasagar Passes Away, South Indian Actress Meena's Husband Vidyasagar Passes Away, Actress Meena's Husband Vidyasagar Passes Away, Meena's Husband Vidyasagar Passes Away, Actress Meenas Husband Vidyasagar Passes Away, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Latest News, Meena, Actress Meena, Actress Meena Latest Updates, Actress Meena Husband, Meena Husband Vidyasagar, Meena Husband Vidyasagar Passes Away, Vidyasagar Passes Away, Meena latest News, Vidyasagar Passes Away due to Covid Complications, Covid Positive, covid Virus, Vidyasagar latest News Updates, Meena Movies, Meena latest Movie Updates, Meena Upcoming Movies, Meena New Movies, Meena Latest News and Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ దక్షిణాది నటి మీనా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. కాగా విద్యాసాగర్ వయస్సు 48 సంవత్సరాలే కావడం విశేషం. అయితే ఆయన పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బెంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్త అయిన విద్యాసాగ‌ర్‌ను నటి మీనా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి నైనిక‌ అనే ఒక పాప‌ ఉంది. ప్రస్తుతం వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. కాగా మీనా ఫ్యామిలీలో అందరికీ గతంలో కరోనా సోకింది. అయితే అందరూ కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ, విద్యాసాగర్‌ మాత్రం కొన్ని నెలలుగా పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం.

ఈ క్రమంలో విద్యాసాగర్‌ మృతిపై స్థానిక మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు మాత్రమే కాదని, పావురాల వ్యర్థాలు కూడా ఆయన మృతికి కారణమని చెప్తున్నారు. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లనే ఆయన శ్వాసకోశ సమస్య ముదిరి ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయని, విద్యాసాగర్‌ తరచూ ఆ పావురాలకు దానా వేస్తుండేవారని, వాటితో ఎక్కువ సమయం గడిపడం వల్లనే ఆయనకు శ్వాస సంబంధిత సమస్య తీవ్రమైందని వార్తలు వస్తున్నాయి. కోవిడ్‌-19 సోకిన సమయంలో విద్యాసాగర్‌ ఊపిరితిత్తులకు బాగా ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు సూచించారని తెలియవస్తోంది. అయితే ఇప్పటివరకు దాతలు దొరకకపోవడంతో విద్యాసాగర్‌ మృతి చెందినట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here